-
-
సభాపర్వం - వ్యాసాలు
Sabhaparvam Vyasalu
Author: R V Rama Rao
Publisher: Ananya Prachuranalu
Pages: 112Language: Telugu
"సభాపర్వం" మన పార్లమెంటరీ సంప్రదాయాలలో ఉన్న మంచిచెడ్డలను, రికార్డులను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది.
* * *
చట్టసభ రాజకీయ కార్యాచరణలో ప్రధాన భాగం. ఎన్నికలు అక్కడికి ప్రజల ప్రతినిధులను పంపే ప్రధాన ప్రక్రియ. మన దేశంలో ప్రజాస్వామిక రాజ్యాంగంపై అనేక విమర్శలున్నా 1951-52 నుండి క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతూ బాలెట్ ద్వారా అధికార మార్పు జరిగిపోవడం ఒక విశేషం. గత ఆరు దశాబ్దాలుగా మన దేశంలో 16 సార్లు నిరాటంకంగా పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రాల శాసన సభలకూ ఎన్నికలు జరిగాయి. ఈ సంకలనంలో రాసిన వ్యాసాలు 16వ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాసినవి.
అట్లా చెబితే పెద్ద విశేషం లేదు. ఆ సందర్భం నెపంగా గత పదహైదు సార్లు జరిగిన ఎన్నికలూ రాజకీయ పరిణామాలను చట్టసభల పని తీరునూ ఏర్పడిన సంప్రదాయాలనూ స్పీకర్లూ ప్రధానులూ విపక్ష నేతలూ అవిశ్వాసాలు చమత్కారాలు వీటన్నింటినీ ప్రస్తుత కాలం పాఠకుడికి అందించడమే ఈ రచల్లోని ప్రధాన విశేషమూ, చమత్కారం కూడా.
రాజకీయ చాలకాంశాలను చట్ట సభల పనితీరును వివరిస్తూ పదహైదవ లోక్‌సభను పరామర్శించిన తీరు బాగుంది. ఆపనీయక, దించిన తల ఎత్తకుండా చదివించే ఆకర్షణీయ వాక్య విన్యాసంతో రాజకీయాంశాలు చెప్పడం చేయితీరిగిన రచయితలకే సాధ్యమంటారు. నిరంతర అధ్యయనం, గమనింపు, విశ్లేషణలు అలవాట్లుగా మార్చుకున్న ఆర్వీ రామారావు గారు రాసిన విశేష వ్యాస సంపుటి ఇది.
- హారతి వాగీశన్
