• Sabbani Kavi Palku Satyamepudu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సబ్బని కవి పల్కు సత్యమెపుడు

    Sabbani Kavi Palku Satyamepudu

    Pages: 30
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయుణగారు రచించిన ఆటవెలది పద్యాల పుస్తకం “సబ్బని కవి పల్కు సత్యమెపుడు”. వారు ఈ మకుటంతో 120 పద్యాలు రాసినారు. అవి లోక నీతులు, అనుభవ సత్యాలు.


“పలుక నేలనయ్య పద్యంబు వద్దని
తెలుగు పద్య కవిత వెలుగు నిచ్చు
సంప్రదాయమైన సరసమౌ పద్యాలు
సబ్బని కవి పల్కు సత్యమెపుడు” అంటూ పద్య పద్యప్రేమికుడై, పద్యంఫై మక్కువతో వారు ఈ పద్యాలు వ్రాశారు.
మచ్చుకు కొన్ని వారి పద్యాలు చూడండి.


వేమ కవియె గురువు వేదిక విశ్వము
పద్యమల్లి నేను పరవశింతు
లోకరీతులెరిగి లోగుట్టులారసి
సబ్బని కవి పల్కు సత్యమెపుడు


అహము విడిచి బతుక నానందకరమగు
అహము చచ్చెనేని అదియె హాయి
సులభమగును బతుకు సుందరంబుగనొప్ప
సబ్బని కవి పల్కు సత్యమెపుడు


జాలువారినట్టి జానుతెలుగు లోన
పాలు పొంగినట్లు పరవశమున
పద్యములను రాసి పదుగురిని మెప్పింప
సబ్బని కవి పల్కు సత్యమెపుడు


కవితలల్లె వారి కష్టాలు తెలుయుడి
తేనెటీగకున్నతెలివి తోడ
సాలె పురుగు వంటి సాలీడు నెర్పును
సబ్బని కవి పల్కు సత్యమెపుడు


పద్య పాన ప్రియులు పలువురున్నన్ చాలు
మద్యపానమేల మనుజులకును
పద్యపానముననే పావనమ్మౌ బ్రతుకు
సబ్బని కవి పల్కు సత్యమెపుడు

అలతి పొలఁతి పదాలతో ఆటవెలదులలో “సబ్బని కవి పల్కు సత్యమెపుడు” అంటూ సబ్బని వెలువరించిన అనుభవ సత్యాల పుస్తకం ఇది.

Preview download free pdf of this Telugu book is available at Sabbani Kavi Palku Satyamepudu