• Sabbanda Varnala Saraswatam
  • Ebook Hide Help
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సబ్బండ వర్ణాల సారస్వతం

    Sabbanda Varnala Saraswatam

    Publisher: Gnanam Publications

    Pages: 618
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణలోని సబ్బండ వర్ణాల పదసంపద ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రతి పదంలో సారస్వత గుబాళింపును అస్వాదించవచ్చు. ప్రజల ముచ్చట్లలో అనేక ఆణిముత్యాల్లాంటి పదాలు దొర్లుతాయి. వాటికి సారస్వత సొబగులు అద్ది ఉండటం గమనించవచ్చు. స్వఛ్చమైన, సహజమైన వ్యక్తీకరణతో ఆ సారస్వతం మరింత వన్నెలద్దుకుంటుంది. భావతీవ్రత పదాలకు పదును పెడుతుంది. అదే ఈ ముచ్చట్లు, సబ్బండ వర్ణాలు, స్వగతాలు, ముద్రలో ప్రతిబింబిస్తున్నది. గతంలో విడివిడిగా వచ్చిన ఈ పుస్తకాలను ఇప్పుడు ఒకే పుస్తకం తీసుకొస్తున్నాను.

తెలంగాణ జానపద కళారూపాల్లో, గాథల్లో సారస్వతం మరింత సాంద్రతతో కనిపిస్తుంది. ఒగ్గుకథ, శారదకాళ్ల కథ లాంటి కళారూపాల్లో సాహిత్య పదసంపద మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ వ్యక్తికి సైతం అర్థమయ్యే రీతిలో ఆ సాహిత్యం కనిపిస్తుంది. వ్యవహారంలో లేని అనేక పదాలు ఆ కళాకారులు ఉపయోగిస్తారు. ప్రబంధాల్లోని కొన్ని పదాలు అలవోకగా అందులో దొర్లుతాయి. అయినా అవి సాధారణ జనపదులు పూర్తిగా అవగాహన చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ సందర్భాన్ని, సమయాన్ని, సన్నివేశాన్ని అల్లుకుని వచ్చే పదసంపద గంభీరంగా ఉన్నా సులువుగానే జీర్ణించుకోవడం వారి విజ్ఞతను తెలుపుతోంది. ఈ రకమైన ప్రజాసాహిత్యం, జానపద సాహిత్యంలోని పదాలు, సామెతలు, పలుకుబళ్లు అవసరమైనప్పుడు సబ్బండ వర్ణాల నాలికలపై నర్తనమాడతాయి. ముఖ్యంగా జానపద పాటల్లో బతుకమ్మ పాటల్లో ఎంతో గొప్ప సంప్రదాయ సాహిత్యపదాలు దొర్లడం గమనించవచ్చు. కొన్ని సందర్భాల్లో శిష్ట కవులు సైతం ఆశ్చర్యపడే విధంగా పదాలు, సాహిత్య సొబగుల మాటలు దొర్లడం గమనించవచ్చు

- వుప్పల నరసింహం

గమనిక: " సబ్బండ వర్ణాల సారస్వతం " ఈబుక్ సైజు 32.7mb

Preview download free pdf of this Telugu book is available at Sabbanda Varnala Saraswatam