-
-
సాయంకాలమైంది
Saayamkaalamaindi
Author: Gollapudi Maruthi Rao
Publisher: Jyestha Literary Trust
Pages: 319Language: Telugu
గొల్లపూడి ‘సాయంకాలమైంది’ చదువుతుంటే నాటి ఊళ్లచరిత్ర, అక్కడ ఉండే మహానుభావులతోపాటు వారి వ్యక్తిత్వ చిత్రీకరణ, ఏ చదువూ లేని రేచకుని మహోన్నత వ్యక్తిత్వం... ఈ నాడు ఉద్యోగరీత్యా దూరమైన తల్లిదండ్రులకు బాధతోను ఒక విధమైన నిర్లిప్తత, అనాసక్తితో బతికే వారికి ఒక ఓదార్పుగా ఇలా ఆలోచించి బతకండి అనే అంతర్లీనమైన సూచనతో ఎంతో విలువైన రచన.
- కె. ప్రభావతి, విశాఖపట్నం.
‘సాయంకాలమైంది’ చదివినట్లు అనిపించటంలేదు. సాక్షాత్తూ శ్రీ గొల్లపూడి మారుతిరావుగారే మా ఎదుట కూర్చుని నాటకీయంగా చదివి వినిపిస్తూన్నారన్న భావన కలుగుతోంది. అంత అత్యద్భుతంగా, రమణీయంగా, కర్ణపేయంగా ‘వినిపి’స్తాయా పదాలు. వాడుక భాషలో రాసిన ‘వేయి పడగలు’ అని పోల్చినా తప్పు కాదనుకుంటాను. సూపర్ నవల.
- అయి కమలమ్మ, ఆలూరు.
ఒక గొప్ప కథకు ఉండే ఎత్తుగడ, శిల్పం, నడక, ముగింపు అన్నీ అలవోకగా సంతరించుకున్న ఈ రచన ఎంత గొప్పగా ఉందో చెప్పలేను. గొల్లపూడికి అభినందనలు.
- పంతుల జోగారావు, సాలూరు.
సాయంకాలమైంది గురించి కొన్ని మాటల్లో--
తెలుగులో చాలా గొప్ప సాహిత్యం ఉందని విన్నాను. వాటిల్లో చాలా తక్కువ వాటి గురించి తెలుసు. ఆ తెలిసిన చిన్న జాబితాలో కూడా కొన్నే చదివాను- చలం మైదానం, శ్రీశ్రీ మహాప్రస్థానం, శ్రీ రమణ మిధునం. ఇప్పుడు ఆ జాబితాలో గొల్లపూడి మారుతీరావు గారి సాయంకాలమైంది ని జోడిస్తున్నాను. ఈ పుస్తకానికి సాహితీ విమర్శ చేసేంత స్థాయి నాకు లేదు; అయినా ఈ గొప్ప రచన గురించి కొందరికైనా చెప్పాలన్న తాపత్రయం ఉంది. అందుకేనేమో పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఉన్న అనేక extraordinary snippets లో కొన్నిటికి ఎంత చలించిపోయానంటే చాలా మందికి ఆ screenshots పంపాను. చదువు నీకు చాలా నచ్చుతుంది అని అమ్మ అన్నప్పుడు దాని ప్రభావం నా మీద ఇంత ఉంటుందని నేను ఊహించలేదు. థాంక్యూ మా.
కథ దేని గురించి- శ్రీ వైష్ణవ సాంప్రదాయం లో పరమ నిష్ఠా గరిశ్ఠులైన ఒక పురోహితుల కుటుంబం నేపధ్యం. అందులో సుభద్రాచార్యులు అనే ఒక మహానుభవుడు. ఆయన తన తరంలో చూసిన మార్పులు- అలవాట్లల్లో, సాంప్రదాయాల్ని పాటించే తీరులో, సమాజంలో, కుటుంబీకుల మధ్య బాంధవ్యాలలో. దీని చుట్టూ ఒక అద్భుతమైన కథని అల్లారు గొల్లపూడి గారు. సుభద్రాచార్యుల గారి జీవితాన్ని పీఠం గా చేసుకొని చాలా విషయాల మీద సాంఘిక వ్యాఖ్యానం చేసారు. హిందూ తత్వజ్ఞానం గురించి చర్చించారు, అమెరికా వలసల కి అద్దం పట్టారు, తల్లితండ్రుల-పిల్లల అనుబంధాల fabricని దగ్గర నుండి చూపారు, సాయం గురించి మాట్లాడారు, గొప్పవాడెప్పుడూ మంచివాడవ్వాల్సిన అవసరం లేదని చెప్పకుండానే తెలియజేసారు. అంతమైపోతున్న సాంప్రదాయ ఆచారాల నిర్వహణ కళ్ళకట్టినటు చూపించారు.
వీటన్నింటి గురించి ప్రస్తావించటం ఒక ఎత్తు- ఇది ఆయన మేధా సంపత్తికి తార్కాణం. కానీ ఆ విషయాలన్నీ ఇంత మంచి కథలో ఇంత అందంగా అల్లటం చాలా మంది తరం కాదు. గొల్లపూడి వారి వచనం కైంకర్యాం చేసిన వేడి వేడి చక్కెరపొంగలి లాంటిది- రుచి అమోఘం, తన్మయత్వం నిశ్చితం. ఎన్నో పాత్రలు, ప్రతీ పాత్రకీ ఒక అనన్యత. రెండే వ్యాఖ్యాల్లో పాత్రని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ప్రతి మనిషీ వాడి వాడి మనస్తత్వాన్ని బట్టి, కర్మ ఫలాల బట్టి జీవితం నడిపిస్తాడు. అది నిజం, అదే నిజం- మంచి చెడులు నిర్ణయించటానికి మనమెవరం. ఆయన రచనలో judgement ఉండదు, sympathy ఉంటుంది- అదొక benign realism.
మారుతీరావు గారి మీద నాకున్న ఒకే ఒక చిన్న అభియోగం ఆయన అకస్మాత్ authorial intervention. కథ మధ్యలో ఆయన వృత్తాంతాన్ని తెంపుతూ ఒక పేరా మన ప్రస్తుత జీవనశైలి మీద చిన్న aside లాగా రాస్తారు. ఈ కథ ముందు సీరియల్ గా ప్రచురింపబడినందుకేమో అప్పట్లో ఇది అంత కొట్టొచినట్టు కనబడుండదు కానీ పుస్తక రూపంలో సరిగ్గా ఇమడలేదు. అయినా ఏదో పితూరి చెప్పాలని చెప్తున్నాను కానీ ఇది పున్నమి చంద్రుడిలో మచ్చలు చూపటం లాంటిది. అది మనలోని లోపాలకు అభివ్యక్తం మాత్రమే.
ఈ పుస్తకం గురించి నేను చెప్పేదంతా superficial. కుండలో చంద్రుడి ప్రతింబింబం చూపినట్టు. నాలాంటి న్యూస్పేపర్ చదివే అత్తెసరి గాడికే అర్థం అయ్యిందంటే ఎవరైనా చదవచ్చు. మీరే చదవండి- మీలో వొచ్చే మార్పు కి మీరే సాక్ష్యం.
this book is not avainale right now/ please update if available to this id : abckandula@gmail.com
Munduga Gollapudu gaariki namaskaaramulu,
Asalu ee pustakam nenu telugudanam ruchi chuddamani konnani. Nenu aasinchinadaanikante 10 maarlu ekkuvaga kammanidannani, tiiyyadannanni ichina poustakam idi. Prathi teluguvaaru chadavadagga, chadavalsina poustakam idi
I want Print book,Please let me know where i can get it.
Thanks,
Pradeep
అమ్మ ప్రేమని గొల్లపూడి మాటల్లో చదివితే, ఏడవకుండా ఉండటం ఎవ్వరివల్లా కాదు. మంచి ఫీల్ ఉన్న ఒక మంచి నవల.
అమ్మా నాన్నలకి, దేశానికి దూరం అయిన వాళ్ళ అవసారాలని సమర్దిస్తూ వెళ్ళిన వారి భాద్యతలు వివరించి చెప్పిన ఒక చక్కని కధ.