-
-
సాహిత్య సందర్భం సమకాలీన స్పందన
Saahitya Sandarbham Samakaaleena Spandana
Author: Dr Ammangi Venugopal
Publisher: Self Published on Kinige
Pages: 372Language: Telugu
నేను జీవితం మార్జిన్లో రాసుకున్న రెండక్షరాల కవిత్వం. మరో రెండక్షరాలు మీ చేతుల్లో వున్న ఈ సాహిత్య వ్యాసాలు.
అరుదైన వ్యక్తిత్వాల విషయం వదిలేస్తే అధికసంఖ్యాకులకు సాహిత్యం జీవితం ఒకటి కాదు. నేను చూసిన మేరలో ఒకరిద్దర్ని వదిలేస్తే తెలుగు రచయితలకు సామాన్యుడే నాయకుడు. వాస్తవ జీవితమే వస్తువు. గురజాడ, సురవరం ప్రతాపరెడ్డి వేసిన పునాదులమీదే సమకాలీన అస్తిత్వ సాహిత్యం వెలిసింది. అయితే సాధన, అధ్యయనం కొరవడటం మూలంగా అన్ని ప్రక్రియల్లో శిల్పశక్తి కొరవడింది. దీంతో సాహిత్యం కళాత్మకతను కొంతవరకు కోల్పోయింది.
ప్రపంచీకరణ విపరిణామాలకు సీమ తెలంగాణ రచయితలు స్పందించి రాసిన సాహిత్యం గొప్పది. రైతు, కుటుంబం, ఊరు చూట్టూ ఒక పక్షిలాగా తిరిగింది ఈ సాహిత్యం. 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమానికి స్పందిస్తూ కవులు రాసిన కవిత్వం, తెలుగు సాహిత్యంలోనే కాదు జాతీయస్థాయిలో కూడా ఒక ప్రత్యేక అధ్యాయం. కవిత్వ ప్రకియల్లో వచన కవిత మరింత స్థిరపడింది. పాట కొత్త రెక్కలు కట్టుకుని ఎగిరింది. నవల, నాటకం వెనకబడ్డాయి. నేను రాసిన వ్యాసాల్లో వ్యక్తమైన సానుకూల దృష్టి నా స్పందనలో భాగమే.
- అమ్మంగి వేణుగోపాల్
