• Rushimulam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఋుషిమూలం

    Rushimulam

    Author:

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందులోని రెండు కథలూ వివాదాస్పదమైనవి. కధావస్తువు స్త్రీ పురుష సంబంధాలు, వాటి స్థితిగతులు, లక్షణాలు, గురించి. జయకాంతన్ తమిళ సాహిత్యంలో మరెవరూ ఎంచుకోని, నిషేధమని భావించే అంశాలని నిష్ఠూరంగానే అయినా స్పష్టంగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు.

ఈ కథల్లో రచయత వక్కాణించి చెప్పే సందేశం ఇదే: సమాజం మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రజలకి స్త్రీ పురుష సంబంధాల విషయాల్లో సరైన అవగాహన ఉండాలి. ఈ కథల పాత్రలు తమ జీవితాలచుట్టూ బలంగా అమర్చుకున్న అవగాహన ఎటువంటిదో జయకాంతన్ స్పష్టంగా చెప్తున్నారు. అలాంటి అవగాహనని అర్ధం చేసుకోడానికి, విముక్తులు కావడానికి ఇటువంటి కథలు దోహదం చేస్తాయని ఆశించవచ్చు.

"ఋషిమూలం" కధానాయకుడు రాజారామన్ 'ఒక మెంటల్ పేషంటు'; వాడిగురించి ఇందులో నేను మీకు చూపేదంతా ఒక శోచనీయమైన చిత్రణ." అని రచయత మనకి గుర్తు చేస్తున్నారు. యౌవనావస్థలో, అజాగ్రత్త వల్ల సంభవించిన అనుభవం రాజారామన్ మనసుని చిత్రహింసచేసింది. ఆ అనుభవం మింగుడుకాకపోవడంతో ఆపరాధ భావం ఒక జాడ్యంగా అతన్ని ఎడతెగకుండా వెంటాడుతూనే వుంది; ఆదే ఆఖరికి అతని విషాదాంత జీవితంని తీర్చిదిద్దిందని మనకి బోధపడుతుంది.

"ఉగెడు కుర్చీలు" ఒక అడ్డదిడ్డమైన కుటుంబం (dysfunctional family) కథ. ఇంటి యజమాని అలంకారవల్లి సంతానంని అనుమానస్పదతో, నిష్కర్షగా, ఏలుతోంది. ఆమె ఆధిపత్యంలో - కట్టుబాట్లతో - వశమైపోయి మానసిక వ్యధలో చిక్కుకున్న నలుగురు వయసువచ్చినవారి కథ ఇది. అందరూ పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించినవారే. కాని ఆ తల్లి ఆధిపత్యంలోనే వాళ్ళ జీవితం సాగుతోంది. అంతరంగ స్వేచ్ఛ లేక, తల్లి దాక్షిణ్యంతోనే, 'పిల్లలు'గానే వారందరూ రోజులు గడుపుతున్నారు. ఈ కుటుంబంలో మనం చూసేది నిశ్చలత్వమే, మరేం లేదు!

ఉగెడు కుర్చీలు ఈ కుటుంబంని అట్టపెట్టుకున్న మందస్థితికి ఉపమానం. ఉగెడు కుర్చీలవలన గమనంకి సాధ్యం లేదు. ఈ కుటుంబం వేరే దిశలో కొనసాగాలంటే అందుకు మూల శక్తి బయటనుంచి వచ్చి తీరాలి. అంతకుముందు, అంతరంగికంగా, ఆ కుటుంబ సభ్యులలో ఎవరి మనసులోనైనా ఒక ప్రేరణ లేవాలి! జానకి తన్ను ఆవరించుకున్న బంధాల నుండి బయటికి రావాలని ఆలోచించింది. ఆమె విద్యావంతురాలు. పెద్ద ఉద్యోగం చేస్తోంది. ఆమె ఆప్త మిత్రుడు సుందరం ఆమె అంతరంగ స్వేచ్ఛకి దోహదం చెయ్యాలని వచ్చాడు. అదీ సఫలమవలేదు!

ఏతావాతా ఈ కథల్లోని పాత్రలందరూ తమకి మించిన శక్తులతో పోరాడారనీ, ఆఖరికి ఆ శక్తులే వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దాయని మనకి అర్ధమవుతుంది.

- అనువాదకుని ముందు మాటలో నుంచి

Preview download free pdf of this Telugu book is available at Rushimulam