• Running Commentary
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రన్నింగ్ కామెంటరీ

  Running Commentary

  Author:

  Pages: 967
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

దేవీప్రియ గారి రన్నింగ్ కామెంటరీ మూడు సంపుటాలు కలిసిన ఈ-బుక్‌ ఇది.

* * *

'ఎన్నికల కోలాహలం' లోపలి పేజీల్లో నడుస్తున్నప్పుడు ఫ్రంట్‌ పేజీలో మామూలుగా పోకెట్‌ కార్టూన్‌ ఉండేది. కాని, ఎన్నికల తర్వాత 'కోలాహలం' పేజీలను నిలిపివేశాక, అంత గొప్ప ప్రాచుర్యం, అసంఖ్యాక పాఠకుల అభిమానాన్ని సంపాదించిన దేవిప్రియ 'రన్నింగ్‌ కామెంటరీ'ని ఆపడం ఇష్టం లేక దాన్ని ఫ్రంట్‌ పేజీకి మార్చి పోకెట్‌ కార్టూన్‌కి బదులుగా ప్రచురించడం మొదలుపెట్టాము. అప్పటి నుంచి అది నాలుగు శ్టాంజాలకు బదులు రెండు శ్టాంజాల కామెంటరీగా వెలువడడం మొదలయింది. దినపత్రిక ఫ్రంట్‌ పేజీలో అలా 'రాజకీయ కార్టూన్‌ కవిత'ను ప్రచురించం దేశంలో అదే మొదలు. ఇది ఇంగ్లీషుతో సహా యే ఇతర భాషల దినపత్రికలలోనూ లేదు.

ఆంధ్రప్రభలో మొదటి విడత 'రన్నింగ్‌ కామెంటరీ' ఆగిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏడెనిమిది మంది ముఖ్యమంత్రులు, ఇంకా ఎక్కువ మంది ప్రధాన మంత్రులు రంగం మీదికి వచ్చారు, వెళ్ళారు. రన్నింగ్‌ కామెంటరీలో రాసినవన్నీ ఏ రోజుకారోజు జరిగిన సంఘటనలపై రాసినవి. వాటిలో ఏవి ఏ సందర్భంలో రాసినవో ఇప్పుడు - ముప్ఫయేళ్ళ తర్వాత - జ్ఞాపకం చేసుకోవడం దేవిప్రియకి కూడా కష్టం. ఇప్పటి యువతరం వారు అప్పటికసలు పుట్టే ఉండరు. దేవిప్రియ రన్నింగ్‌ కామెంటరీ ఎప్పుడూ రన్నింగ్‌లోనే ఉండాలి - ఆగిపోకూడదు.

ఇంకో విషయం - ముప్ఫయ్యేళ్ళ నాటి రాజకీయ చిత్రం ఇప్పుడు మళ్ళీ తెరపై దర్శనమిస్తోంది. అప్పట్లో ఇందిరమ్మ, ఇప్పుడు సోనియమ్మ. అవే బ్రాండ్‌ రాజకీయాలు. ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. అప్పట్లో ఇందిరమ్మ ప్రతిదానికీ 'విదేశ హస్తం' అంటూ ఉండేది. ఆ 'విదేశీహస్తం' ఆవిడ ఇంట్లోనే, అనుక్షణం ఆవిడ వెన్నంటే ఉంది!

ఆంధ్ర మహాభారతంలో ఇప్పుడు మౌసలపర్వం నడుస్తోంది. తన పేరును, తన మూలాన్ని మరచి, తనకు తానే శత్రువై తనను తానే నరుక్కుంటున్నది జాతి. ఇప్పుడు మళ్ళీ దేవిప్రియ 'రన్నింగ్‌ కామెంటరీ' చాలా అవసరం - పదింతల పదునుతో.

- నండూరి పార్థసారధి

* * *

ఆధునిక పత్రికా రచన చరిత్రలో దేవిప్రియ 'రన్నింగ్‌ కామెంటరీ' ఒక చారిత్రక ఆవిష్కరణ. ఒక్క తెలుగు పత్రికల్లోనే కాదు, జర్నలిజం ఒక వృత్తిగా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా దానికి కొన్ని ప్రమాణాలు, పద్ధతులు యేర్పడిన తరువాత వచ్చిన అరుదైన ప్రక్రియ ఇది. దేవిప్రియ ఆవిష్కరించిన ఈ ప్రక్రియను ఆ తరువాత అనేక మంది అనుకరించాలని ప్రయత్నించినా దాన్ని కొనసాగించలేకపోయారు. అందుకే అది దేవిప్రియ పేటెంట్‌గా మిగిలిపోయింది. సాధారణంగా న్యూస్‌ పేపర్‌లో ఏముంటాయి అని ఏ పాఠకుణ్ణి అడిగినా వార్తలు, సంపాదకీయాలు, వ్యాసాలు. ఇతర ఫీచర్స్‌, కార్టూన్స్‌ అని చెపుతారు. ఎందుకంటే చాలా దేశాల్లో పత్రికల్లో కనిపించే ప్రామాణిక శీర్షికలు ఇవే. కాని ఒకానొక కాలంలో తెలుగు పాఠకులు 'రన్నింగ్‌ కామెంటరీ' అని కూడా చెప్పేవారు. తెలుగు పాఠకుల ఆలోచనల మీద అటువంటి బలమైన ముద్ర వేసిన శీర్షిక అది.

ఆంధ్రప్రభ దినపత్రికలో దేవిప్రియ మొదలుపెట్టిన ఈ ప్రయోగం ఆయన ఎన్ని పత్రికలకు మారితే అన్ని పత్రికల్లో ప్రత్యక్షమయ్యింది. రన్నింగ్‌ కామెంటరీ మాత్రాచంధోబద్ధ రూపంలో ఉన్నా, అందులో వార్త, దానిని అర్ధం చేసుకోవాల్సిన విధానం అంతర్లీనంగా ఉండేది. లోతయిన అవగాహనతో పాటు సమగ్ర విశ్లేషణ ఉండేది. అలాగే ఏదో ఒక హితబోధ కూడా కనిపించేది. ఇవన్నీ ఎనిమిది లైన్లలో (పాదాల్లో) చెప్పడం ఒక్క దేవిప్రియకు మాత్రమే సాధ్యపింది. ఒక వార్తకంటే సంక్షిప్తంగా, సంపాదకీయంకంటే సరళంగా, ఒక వ్యంగ్య చిత్రం కంటే సున్నితంగా, ఒక వ్యాఖ్యానం కంటే సునిశితంగా ఒక వార్తను కవిత్వీకరించి, దానికి తాత్వికత జోడించి సిద్ధాంతీకరించి చెప్పడం ఒక్క దేవిప్రియకు మాత్రమే సాధ్యమయ్యింది.

1980 దశకంలో పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన మా దినచర్య రన్నింగ్‌ కామెంటరీతోనే మొదలయ్యేది. అది అశేష జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొంది చివరకు కేవలం రన్నింగ్‌ కామెంటరీ కోసమే పత్రిక కొనుక్కునే పాఠకులు కూడ తయారయ్యారు. నాకు తెలిసి అంతటి ప్రజాదరణ పొందిన ప్రక్రియ ఇంకొకటి తెలుగు పత్రికల్లో లేదు. బహుశ భవిష్యత్తులో రాదు.

- ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి

Preview download free pdf of this Telugu book is available at Running Commentary