-
-
రుణం
Runam
Author: Gollapudi Maruthi Rao
Publisher: Creative Links Publications
Pages: 288Language: Telugu
మారుతీరావుగారు భారతీయ సంస్కృతీ సంప్రదాయ శక్తులనూ, ప్రత్యేకించి స్వచ్ఛమైన, పవిత్రమైన భారతీయతను ఈ నవలలో ఆవిష్కరించారు. తెలుగు నవలాసాహిత్యం తొలిదశలో కందుకూరి వీరేశలింగం పంతులుగారి ‘రాజశేఖర చరిత్ర’, చిలకమర్తి లక్షీనరసింహంగారి ‘గణపతి’, విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’, అడివి బాపిరాజుగారి ‘నారాయణరావు’ మొదలైన ఎన్నో నవలలు వచ్చాయి. ఇది భారతీయ నవల. ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, కర్మభూమిలోని పవిత్రతకూ ఆటపట్టయిన నవల.
- సి.యస్.రావు
గొల్లపూడివారు పాఠక రచయితల్ని, పాఠకుల్ని ఏకకాలంలో మెప్పించారు. తెలుగు పాఠకులు గొల్లపూడివారికి రుణపడ్డారో, గొల్లపూడివారే పాఠకులకి రుణపడ్డారో లెక్కలుకట్టి చెప్పడం కష్టం. గొల్లపూడివారు అడపాదడపా ఈ రుణానికి వడ్డీ చెల్లిస్తుంటే నాలాంటివాళ్ళం చాలా సంతోషిస్తాం.
- మాడభూషి దివాకరబాబు
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారూ, సిగ్మండ్ ఫ్రాయిడ్, అర్థర్ కోనన్ డాయిల్ (షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త) ఏకాత్మగా శ్రీ గొల్లపూడి మారుతీరావుగారిని ఆవహించి, భారతీయ తత్వ శాస్త్ర సారాన్ని, మానసిక విశ్లేషణతో మేళవించి అపరాధ పరిశోధన నేపథ్యాన్ని రంగరించి ‘రుణం’ ధారావాహికగా తెలుగు పాఠకులకి అందిస్తున్న అనుభూతి కలుగుతోంది. తెలుగు సాహిత్యంలో మరో జ్ఞానపీఠ పురస్కారాన్ని దక్కించుకునే రోజు త్వరలోనే రానున్నదని ‘రుణం’లోని ప్రతి వాక్యం ఆశ కల్పిస్తోంది.
- ఆచాళ్ళ శ్రీనివాసరావు
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹162
అతి సాధారణమైన నవల. దిగ్గజాల గత నవలలతోనూ,మారుతీరావు గారి సాయంకాలమైంది వంటి గొప్ప నవలలతోనూ లేశమాత్రం పోల్చలేం.
Bagoledu ani analem kani. @vamshi_kt garu anattu Sayamkalamayindi tho polika ledu