-
-
రోటి పచ్చళ్లు
Roti Pachallu
Author: Vasireddy Venugopal
Publisher: Vasireddy Publications
Pages: 182Language: Telugu
Description
ఇది వంటల పుస్తకం కాదు. ఒక జ్ఞాపకాల పుస్తకం. చదువుతున్న కొద్దీ.. అనేక తీపి గుర్తుల రోటిరుచుల రూపంలో మన మనసును తాకుతుంటాయి. ఈ పుస్తకంలో కొన్ని రోటి పచ్చళ్లు ఎలా చేసుకోవాలో వున్నాయి. ఇది సర్వసమగ్రం కాదు. ఒక్క దోసకాయ పచ్చడినే కనీసం పాతిక రకాలుగా చేసుకోవచ్చు. దేని రుచి దానిదే. కలిపే పదార్ధాలను బట్టి ఏ పద్ధతిలో, ఎప్పుడు కలిపాం అనే దానిని బట్టి, నూరే చేతిని బట్టి రుచి మారుతుంటుంది. ఒకే పచ్చడి రిపీట్ అయినట్టు పాఠకులకు అనిపించవచ్చు. కానీ దేని రుచి దానిదే.
Cooking is a combination of Art and Science అని నేను గట్టిగా నమ్ముతాను. ఇది ప్రారంభం మాత్రమే. ఈ పుస్తకాన్ని సుసంపన్నం చేసే సర్వహక్కులు పాఠకుల రోట్లో వున్నాయి. మరిన్ని రోటిపచ్చళ్లను పాఠకులు జోడించవచ్చు.
- వాసిరెడ్డి వేణుగోపాల్
Preview download free pdf of this Telugu book is available at Roti Pachallu
ఈ పుస్తకంలో " రోటి పచ్చళ్ళు "కొన్ని బావున్నాయి,కొన్ని పర్వాలేదు అన్నట్లు ఉన్నాయి.ఇందులో రోటి పచ్చళ్ళ తయారీ విధానం లో రోలు వాడకం తప్ప మిగిలిన విషయాలు ఎక్కువగా అందరికీ తెలిసినవి ఉన్నాయి." రోటి పచ్చళ్ళు " అందరూ చేస్తుంటారు! ఈ ఆధునిక కాలంలో రోళ్లకు బదులుగా మిక్సర్ /గ్రైండర్ వాడుతున్నారు. రోళ్లు బరువైనవి కావడం వల్ల,వెంట తీసుపోవవడం సాధ్యం కాదు కాబట్టి వాటి వాడకం తగ్గింది. రోటి పచ్చళ్ళ గురించి చర్చించిన పుస్తకం కాబట్టి పుస్తక ప్రియులు దీన్ని ఉత్సాహంగా చదవవచ్చు! వంటలు,పచ్చళ్ళు చెయ్యడం బాగా తెలిసినవారికి దీని అవసరం లేదని చెప్పవచ్చు!
I buy this book, but E book download not working