-
-
రొమాంటిక్ సీక్రెట్స్
Romantic Secrets
Author: Saili
Publisher: Victory Publishers
Pages: 64Language: Telugu
నవతరం ప్రేమికుల కోసం ప్రచురణకర్తలు అందిస్తున్న పుస్తకం "రొమాంటిక్ సీక్రెట్స్".
ఈ పుస్తకం కౌమార ప్రాయంలోని యువతీ యువకులకు ఎంతగానో ఉపకరిస్తుంది.
కౌమారంలో పిల్లలలో వచ్చే మానసిక మార్పులు, వారిలో కలిగే భావసంచలనం గురించి తెలియజేస్తూ, తల్లిదండ్రులు, పిల్లలు ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది.
యవ్వనంలో కలిగే స్పందనలన్నీ ప్రేమ కాదనీ, నిజమైన ప్రేమకీ, అకర్షణకీ మధ్య తేడాని గుర్తించాలని సూచిస్తుంది.
ప్రేమికులకు ఎదురయ్యే సందేహాలకు రచయిత సమాధానాలు సూచించారు ఈ పుస్తకంలో.
ఇంకా, ఈ పుస్తకంలో, ప్రేమ కవితలు, ఎస్. ఎం. ఎస్లు పంపేందుకు వీలుగా కొన్ని ప్రేమ కొటేషన్స్ ఉన్నాయి.
* * *
గుండెలోని భాష మౌనం
మునికన్య లాస్యం మౌనం
నా గుండె ఘోష సముద్ర ఘోష
అలలు లేని తుఫాను ఘోష
నీ చిరుదరహాసం కోసం తపన
అది నోచుకోనని తెల్సినా ఆగని నా తపన
తపించే మునికి, నిరీక్షించే నాకు
మునికన్యనై, వరాల దేవతవై ముంగిట నిలు
నీ గుండెలో నా ఆశలు నింపుతా
నా మనసులో పీఠం వేసి పూజిస్తా, ప్రేమిస్తా.
