-
-
రోజుకో శ్లోకం
Rojuko Slokam
Author: Malladi HanumanthaRao
Publisher: Self Published on Kinige
Pages: 128Language: Telugu
'రోజుకో శ్లోకం' అనే ఈ పుస్తకం నూట పదహారు జగత్ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకాల కదంబం. వీటిలో భక్తి, జ్ఞాన, నీతి, వైరాగ్య బోధకాలైన శ్లోకాలతో పాటు కొన్ని 'చమత్కార' శ్లోకాలూ, కొన్ని సాహిత్య సంబంధమయిన శ్లోకాలూ ఉన్నాయి. ఈ శ్లోకాలన్నింటికీ సరళమైన తెలుగులో తాత్పర్యమూ, చిన్న వ్యాఖ్యానమూ, అవసరమైన చోట ప్రతి పదార్థమూ ఇవ్వబడ్డాయి. ఏరి కూర్చిన శ్లోకాలు కాబట్టీ, విషయ వైవిధ్యం ఉన్నదీ కాబట్టీ, ఈ సమాహారం సంస్కృతభాషలో అంతో యింతో ఆసక్తి ఉన్న తెలుగు పాఠకులకు సత్కాలక్షేపం అందించగలదని ఆశ.
సంస్కృతంలో ఉన్న అద్భుతమైన శ్లోకాలు కొన్నయినా, కొంత వివరంగా నేర్చుకొందామనుకునే సామాన్య పాఠకులకు ఈ పుస్తకం సంస్కృత పరిచయం పెంపొందించి, ఒక చిన్న సంస్కృత శ్లోక స్వయంబోధినిగా ఉపకరించాలని కూడా ఉద్దేశించబడినది. ఇది పండితుల నుద్దేశించి చేసిన ప్రయత్నం కాదు.
వీలయితే ఈ శ్లోకాలు, క్రమం తప్పకుండా రోజుకొకటి చొప్పున నేర్చుకొని, అర్థం తెలుసుకొని, కంఠస్థం చేయగలిగితే, ఆసక్తిగల పాఠకులు సుమారు నాలుగయిదు నెలల కాలంలో 100 - 120 శ్లోకాల నిధిని తమ సొంతం చేసుకోవచ్చు. ఈ శ్లోకాలలో చాలా భాగం సుగమమైనవీ, బహుశా పాఠకులకు ఇంతకు ముందే కొంత పరిచితమయినవీ కనుక అలాంటి ప్రయత్నానికి అనువుగా ఉంటాయి. ఆ రకమైన ప్రయోగానికి ఈ పుస్తకం అటు పాత తరాల పాఠకులకూ, ఇటు కొత్త తరం వారికీ ఉపయోగపడగలదని మరో ఆశ.
- మల్లాది హనుమంతరావు
మంచి పుస్తకం.