-
-
రోజుకో పద్యం
Rojuko Padyam
Author: Malladi HanumanthaRao
Publisher: Self Published on Kinige
Pages: 120Language: Telugu
Description
సాహిత్యాభిలాషగల సామాన్య పాఠకుల ప్రయోజనం కోసం, తెలుగు సాహిత్యోద్యానం నించీ తెచ్చి కూర్చిన నూట పదహారు పద్య సుమాల మాల ఈ 'రోజుకో పద్యం' పుస్తకం.
బాగా ప్రచారం పొందిన ప్రార్థన పద్యాలూ, ప్రాచీన కవుల పద్యాలూ, ప్రబంధ కవుల పద్యాలూ, శతక పద్యాలూ, చాటువులూ, ఆధునిక కవుల పద్యాలూ, నాటక పద్యాల నించీ ఏరి కూర్చిన మణి పూసల సమాహారం ఈ చిన్ని పుస్తకం.
ఈ పద్యాలు కంఠస్తం చేసుకోగలిగితే, 'మనిషికి వాక్కు భూషణం' అన్నారు గనుక, మన పెద్దలు ఎంతో ప్రేమతో మనకు వారసత్వంగా అందించిన ఈ ఆభరణాలు మన సొంతం చేసుకొని నిరంతరం ధరించవచ్చు. ఈ సాహిత్య సౌరభాన్ని మనం ఆస్వాదించమే కాక, మనకు తటస్థపడ్డ మిత్రులందరికీ అక్షయంగా పంచవచ్చు.
- మల్లాది హనుమంతరావు
Preview download free pdf of this Telugu book is available at Rojuko Padyam
Login to add a comment
Subscribe to latest comments
