-
-
రేవు చూడని నావ
Revu chudani naava
Author: T. Srivalli Radhika
Publisher: Pramatha Prachuranalu
Pages: 73Language: Telugu
Description
శ్రీమతి శ్రీవల్లీరాధిక ఆర్ద్ర భావుకత ఈ సంపుటి నిండా పరుచుకుని వుంది. దాన్ని అభివ్యక్తం చేసే కమనీయ శైలి ఈమెకు అలవడింది. ఉదాహరించదగిన పంక్తులు అన్ని కవితల్లో వున్నాయి.
- డా. సి. నారాయణరెడ్డి.
శ్రీమతి శ్రీవల్లీరాధిక అచ్చమైన కవయిత్రి. ఆమె తపనలో తపస్సులో నిజాయితీ వుంది. ఆమె ఆలోచనలో విద్యుల్లత వుంది. ఆమె ఆవేదనలో అభ్రగర్జన వుంది. ఆమె పదాల పోహళింపులో పరిమళం వుంది. ఆమె సౌమ్యతలో సాగర ఘోష వుంది. ఆమెలో మానవత్వం వుంది. ఈ సంపుటి నిండా కవిత్వం వుంది!
- డా. ఆచార్య తిరుమల.
అస్పష్టత లేని అక్షరాల మధ్య తన భావుకతనూ, అభిప్రాయాన్నీ సుస్పష్టంగా చెప్పడం ఈమె ప్రత్యేకత. ఈమె కలంలో స్త్రీ సహజమైన ఆర్ద్రత వుంది. తాడితుల పట్ల ఆవేదన వుంది. అందుకే అక్షరక్షరంలో అమూల్యంగా కనిపించే “అమ్మతనం” – ఈ కవయిత్రి కవిత్వానికి ఆభరణమై భాసిస్తుంది.
- డా. నాగభైరవ కోటేశ్వరరావు.
Preview download free pdf of this Telugu book is available at Revu chudani naava
Login to add a comment
Subscribe to latest comments
