-
-
రెప్పలేని లోకం
Reppaleni Lokam
Author: Dr. Bandi Satyanarayana
Publisher: Gowtam Prachuranalu
Pages: 72Language: Telugu
Description
పరిమళానికి పాదాలుంటాయి
రెక్కలూ ఉంటాయి
మనల్ని తన రెక్కల మీద ఎక్కించుకుని
అందమైన లోకాల్లో తిప్పుకువస్తుంది
బాల్యంలో అమ్మ పాడిన పాట
మళ్ళీ ఇప్పుడు మననం చేసుకుంటే
అదో గొప్ప పరిమళం
చిన్నప్పుడు కురిసిన
వర్షపు జల్లు
ఓ పురా పరిమళమై
మళ్ళీ వికసించినప్పుడు
పచ్చిపరిమళం గుప్పుమంటుంది
ఒకనాటి పెరట్లో బంతిపూలు
ఆ వెనకే ముద్దమందారాలు
నా కోసం మళ్ళీ ఇప్పుడు వికసించి
సరికొత్త పరిమళాన్ని పంచుతాయి
కళ్ళతో పలకరించిన
స్నేహితుని నవ్వుకీ పరిమళముంటుంది
దాని వెనక వెళ్ళ గలిగితే
ఎన్నో తీపి గురుతుల పరిమళాలు
కార్తీక పున్నమిలో
పచ్చ 'ధనాన్ని' కోల్పోయి
తెల్లముఖాలేసిన చెట్లూ ఓ పరిమళమే
ఏటి ఒడ్దున నడుస్తుంటే
నీటిలో జలకాలాడే చంద్రుడూ ఓ పరిమళమే.
పరిమళం శ్వాస
మీరు నరయంత్రం కాకముందే
కాస్త పరిమళాన్ని మూటగట్టుకోండి
మనిషిగ మిగిలి పోతారు.
Preview download free pdf of this Telugu book is available at Reppaleni Lokam
Login to add a comment
Subscribe to latest comments
