-
-
రెండు తమిళ ఆణిముత్యాలు - బ్రహ్మోపదేశం, స్పటికం
Rendu Tamila Animutyalu Brahmopadesam Spatikam
Author: Andy Sundaresan
Publisher: Kurinji Publications
Pages: 70Language: Telugu
ఇది రెండు కథల సమాహార పుస్తకం (బ్రహ్మోపదేశం, స్పటికం)
"బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః" అని బ్రాహ్మణుడికి నిర్వచనం ఉంది. పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి బ్రహ్మజ్ఞానం సంతరించుకున్న తదుపరి బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు.
బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు, బ్రాహ్మణుడుగా జీవించడం గొప్ప. సర్వ శాస్త్రాలు, సమస్త హైందవ ధర్మం ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి.
ఈ కధల్లో వచ్చే శంకర శర్మ, యజ్ఞం, ఈ ధార్మిక లక్షణాలున్న, వేరే వేరే రచయతలు సృష్టించిన పాత్రలు.
జయకాంతన్ పాత్రలో తన కుల బ్రాహ్మణ ఔనత్యం కాపాడడానికి శర్మగారు ఒక ఉద్యమంకి నాయకులు. అతనిలో విప్లవాత్మక ఉంది. ఈ కలియుగంలో ఇతర బ్రాహ్మణుల ధోరణి చూస్తే అతనికి ఈసడింపు. ఆధునిక యుగంలో ఉదయించే కొత్త శక్తులతో అతను మూర్ఖంగా పోరాడుతున్నారు.
ఇది ఒక వివాదాస్పదమైన కధ. ఇది 'ఆనంద వికటన్' పత్రికలో ప్రచురమైనప్పుడు చాలామంది పాఠకులకి శర్మగారి సాహసం - నిర్ణజ్ఞత - మింగుడు కాలేదు.
'మహఋషి' పాత్ర యజ్ఞంకి ఎవరిమీదా తిరగబడే స్వభావం లేదు. తన స్వధర్మం కాపాడుకోవడం - అదే వాడికి ముఖ్యం. వాడిగురించి అన్ని కబుర్లూ ముసలమ్మే మనకి చెప్తోంది. కొన్నిచోట్ల భగవద్గీతలో శ్లోకాలు వల్లించి వాడెవడని మనకి గుర్తుచేస్తోంది.
స్పటికం కల్కీ - మహాత్మా గాంధీ శతజయంతి (అక్టోబర్ 5, 1969) సంచికలో వెలువడింది.
- ఏండీ సుందరేశన్
