-
-
రెండు పక్షులూ.. ఒక జీవితం
Rendu Pakshulu Oka Jeevitam
Author: Boorla venkateshwarlu
Publisher: Saahithi Sopathi
Pages: 89Language: Telugu
వాళ్ళిద్దరూ సృష్టి మొదటి నుండీ ఉన్నారు. వాళ్ళిద్దరూ సృష్టిలో చెరి సగం. వాళ్ళిద్దరూ చిరకాల సహచరులు. వాళ్ళిద్దరిలో ఒకరిలో లేని ప్రత్యేకతలు మరొకరిలో ఉన్నాయి . కనుకనే, వాళ్ళిద్దరూ పరస్పర ఆకర్షితులు, ఆశ్రితులు, అవసరార్థులు. అతని మాటలూ చేష్టలూ ఆమెకూ, ఆమె మాటలూ చేష్టలూ అతనికీ భిన్నమైనవి. అప్పుడప్పుడూ అవి తీయనైనవి, అప్పుడప్పుడూ అవి విరుద్ధమైనవి కూడా...
వాళ్ళిద్దరి అర్థాలూ ఆలోచనలూ వేరైనా సహగమించే జీవితం ఇద్దరికీ ఒక్కటే. ఈ జీవితానికి ఇద్దరూ కొత్త వాళ్లే. ఏమీ తెలియని పసి బాలురే. వాళ్ళిద్దరికీ తమవైన ప్రత్యేక ఆలోచనలు, అభిప్రాయాలు ఉండడమే వాళ్ళ జీవ చైతన్య అస్తిత్వంలో భాగం. అయినా, వాటిని ఒకరినొకరూ ఆమోదిస్తూ, అనుమోదిస్తూ, అనుగమిస్తూ, అనుసరిస్తూ, సరస విరసాలనూ స్వాగతిస్తూ ఒకరికి ఒకరు అర్థమైతే జీవితం ఆత్మీయం...
ఏ అపోహలూ, అసూయలూ, అహంకారాలూ, అవమానాలూ, ఆధిపత్యాలూ లేని పక్షులు అనాదిగా బతుకు పోరాటాన్ని చేస్తూనే కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. అన్ని కాలాల్లోనూ అన్యోన్యంగా బతుకుతున్నాయి. రెండు పక్షులదీ ఒకే జీవితం, ఒకే గమనం, ఒకే గమ్యం.
ఈ కవిత్వం ఇట్లా సంభాషణగా వెలువడడానికి ఒక ప్రేరణ దీవి సుబ్బారావు గారు తెలుగులోకి అనువాదం చేసిన గాథా సప్తశతి. ధ్వని ప్రధానంగా ఉన్న చిన్న గాథ ఒక భావాన్ని చెప్పడానికి బాగా ఉపయోగపడుతుంది. దంపతుల మధ్య లోపిస్తున్న అవగాహనను సరి చేయడానికి సున్నిత సరస సంభాషణే ఔషధం. ఈ కవిత్వాన్ని దంపతుల మధ్య సంభాషణా శైలిగా నేను మలచుకున్నాను.
- బూర్ల వేంకటేశ్వర్లు
