-
-
రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా
Rendo Prapancha Yuddhamlo Russia
Author: Tolety Jaganmohana Rao
Publisher: Surya Prachuranalu
Pages: 304Language: Telugu
ఈ యుద్దంలో...
* జూన్ 22,1941 లో 55 లక్షల జర్మన్ సైన్యం, 48,000 శతఘ్నులు. 3000 టాంకులు. 5000 విమానాలతో హఠాత్తుగా రష్యా మీద దాడిచేసింది.
* జర్మన్ సైన్యం చుట్టు ముట్టడంతో లెనిన్ గ్రాడ్ నగరం 900 రోజులు దిగ్బంధంలో ఉంది. బయటనుంచి ఆహారం అందే మార్గం లేక నగర జనాభాలో మూడో వంతు, దాదాపు పది లక్షలు ఆకలితో మరణించారు.
* ఆగష్టు 23,1942 న స్టాలిన్ గ్రాడ్ నగరం మీద జర్మన్ వైమానిక దళం ఆరు వందల విమానాలతో రెండు వేల దాడులు చేసినప్పుడు, ఆ ఒక్కరోజులోనే 43,000 మంది పౌరులు చనిపోయారు. 1,50,000 మంది గాయపడ్డారు.
* రెండు కోట్ల తొంభైలక్షల మంది రష్యన్ పౌరులు బలి అయ్యారు. అంటే ప్రతీ ఏడుగురిలోనూ ఒకరు మరణించారన్న మాట. రెండో ప్రపంచయుద్ధంలో, అన్ని రంగాలలోనూ అమెరికన్ నష్టాలు 4,13,000, బ్రిటన్ నష్టాలు 4,95,000 మాత్రమే.
* యూరోపులో జరిగిన మొత్తం నష్టంలో సగం రష్యాలోనే జరిగింది. అమెరికా పొందిన నష్టం కంటే వంద రెట్లు రష్యా నష్టపోయింది.
* ఆనాటి కమ్యూనిస్టులు స్టాలిన్ అనంతరం అధికారంలోకి వచ్చిన కులాసా కమ్యూనిస్టులవంటి వారు కాదు. 50 లక్షల మంది పార్టీ సభ్యులలోనూ 30 లక్షల మంది మెరికల్లాంటి కామ్రేడ్స్ యుద్దానికి బలైపోయారు.
* ఊహించ సాధ్యంకాని గడ్డు పరిస్థితులలో రష్యన్ కార్మికవర్గం నాలుగు సంవత్సరాల యుద్ధకాలంలోనూ 4,90,000 శతఘ్నులు, మోర్టార్లు, 1,20,000 టాంకులు, స్వయం చలిత శతఘ్నులు, 1,37,000 యుద్ధ విమానాలు, సైన్యానికి కావలసిన మందుగుండు, ఇతర సామాగ్రి నిరంతరాయంగా అందించి అంతిమ విజయానికి తోడ్పడింది.
