-
-
రేనాటి రాజ సింహం
Renati Raja Simham
Author: S.M.D.Inaithulla
Publisher: B.V. Subba Reddy Memorial Publications
Pages: 200Language: Telugu
ప్రపంచంలోని అన్ని దేశాల సముద్రశాస్త్ర పరిశోధన విద్యార్థులకు మార్గదర్శి అయిన డా.యం.పి.యం.రెడ్డి గారికి శ్రీ బీ.వీ.సుబ్బారెడ్డి గారితో ఆత్మీయ అనుబంధం వుంది. రాజకీయ రంగంలో నిస్వార్థ సేవాగుణంతో నిజాయితీ, నిబద్ధతతో ప్రజాసేవ చేసిన శ్రీ బీ.వీ. గారి జీవిత చరిత్రను రాయించాలనే సంకల్పం కల్గింది. బీవీ గారి కుటుంబ సభ్యులు సైతం ఆ సంకల్పానికి తోడయ్యారు.
డా.యం.పి.యం.రెడ్డిగారు నన్ను ఈ పుస్తకరచన కోసం ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కథలు, వ్యాసాలు, కవితలు రాసుకుంటున్న నేను తొలిసారిగా ఒక మహనీయుని జీవిత చరిత్ర రాయడనికి సాహసించాను. అందులోనూ కోయిలకుంట్ల సమీపంలోని బనగానపల్లెలో పుట్టిన నేను శ్రీ బీవీ సుబ్బారెడ్డిగారి చరిత్ర రచన చేయడం కోసం ఒక పులకింతకు గురయ్యాను. కాలుష్యం పెరిగిపోయి స్వార్థ బుద్ధి మితిమీరిపోతున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు కొంతైనా కనువిప్పు కల్గించేందుకు ఈ పుస్తక రచన దోహదపుతుందని ఆకాంక్షించాను.
ప్రస్తుత తరం వాళ్ళు బీవీగారి జీవిత చరిత్ర లోని కొన్ని అరుదైన సన్నివేశాలను, పుటలను పరిశీలిస్తే ఆశ్చర్యపోక మానరు. కేవలం బీవీకి మాత్రమే సాధ్యమయ్యే పనులు కొన్ని ఉన్నాయి. శాసనసభ స్పీకర్గా ఆయన ఉత్తమ రాజకీయ భీష్మాచార్యుడిగా ఇరుపక్షాలకు న్యాయం చేసి ఉత్తమ స్పీకర్గా రాణించారు. ఆంగ్లంలో అనర్ఘళంగా రాయగల, ప్రసంగించగల నిపుణుడిగా షేక్స్పియర్ ఆఫ్ ది అసెంబ్లీగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్రోద్యమంలో, ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో రాజీలేని పోరు చేసి చక్కని పోరాట స్ఫూర్తిని నింపారు. రెండు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్రదేశం నిండా ఎంతోమంది ఆత్మీయులను ఆస్తిపాస్తులుగా సంపాదించుకున్నారు. ఏదైతేనేం ఇది బీవీగారి రేఖామాత్ర సంక్షిప్త జీవిత చరిత్ర మాత్రమే. దీనిని చదివి మీ ఆశీస్సులందించగలరని మనవి.
యస్.యండి.ఇనాయతుల్లా
గమనిక: "రేనాటి రాజ సింహం" ఈపుస్తకం సైజు 11 mb
