-
-
రెక్కలొచ్చాయి
Rekkalochchayi
Author: C.Yamuna
Publisher: Vanavasi Prachuranalu
Pages: 160Language: Telugu
నిత్య యవ్వని, రహస్య ప్రేమికుడు, నీ కోసం కథలు వేటికవే ప్రత్యేకం. సంప్రదాయంతో నాగరికతకు స్నేహం కలిపిన నిత్య యవ్వని, ఎవ్వరి కోసం వాళ్ళు సొంతానికింత జీవితం వుంచుకోవాలనే నీ కోసం, రహస్య స్నేహితుడెవరో చెవిలో చెప్పిన కథ – ఆలోచనల్లో, ఆచరణా చైతన్యం నింపే కధకురాలి కథనాలు.
కధలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా చదివేయాలనిపిస్తుంది. తీరా చదివేసాక మళ్ళీ ఇంకోసారి పేజీలు వెనక్కు తిప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూవున్న జీవితంలో సాన్నిహిత్యం, పరిశీలనలను కథలకు అన్వయించిన నవ్య దృష్టి, అభివ్యక్తిలోని నూతనత్వం, ఉక్తుల్ని, సూక్తుల్ని కథానుగుణంగా ఉపయోగించిన సంవిధానం, కథకురాలి నిజాయితీ, జవాబ్దారీ చదువరిని ఆకట్టుకుంటాయి.
కొత్త రెక్కలతో, ముందుతరం సరికొత్త ఆలోచనా దృక్పథంతో, పాఠక హృదయాలను ఉత్సాహంతో నింపే రచయిత్రి యమున.
- డా. కె.బి.లక్ష్మి
పక్షి రెక్కలలోని సున్నితత్వం, పూల లలితమైన పరిమళం కలబోసుకుని మనసుకు పూసిన కథలే యమున గారి కథల సంపుటి.
- శరత్చంద్ర
Manava jeevitham loni annii drukkonalanu srujisthu prema , apyayatha , dooradrusti , inspiration , motivation, prakruthi aradhana , bandhavualanu chakkaga C Yamuna garu manchi manasutho rasina kathalu.Prathi okkaru thappaka chadavavalasina chakkani Kathalu "" REKKALOCCHAI ""