-
-
రెడ్ షాడో
Red Shadow
Author: Madhubabu
Publisher: Madhupriya Publications
Pages: 270Language: Telugu
షాడో సి.ఐ.బి.లో సీక్రెట్ ఏజెంట్గా చేరకముందు, దొంగతనాలు చేస్తూ నేరస్థుడిగా జీవితం గడుపుతున్నప్పటి కథల్లో ఇది ఒకటి. ఇండియన్ స్పెషల్ బ్రాంచి తనను అరెస్ట్ చేయటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించబోతున్న సమయంలో, భారతదేశాన్ని వదిలి జపాన్ దేశానికి పారిపోయాడతను.
అక్కడ కుంగ్ఫూ విద్యాపీఠంలో చేరి విద్యాభ్యాసం చేస్తున్న తరుణంలో ఫ్యుజీశాన్ అనే కుంగ్ఫూ వస్తాదుతో తగాదా పడతాడు. తత్ఫలితంగా జపాన్ దేశంలో కూడా నిలబడటం కష్టం అవుతుంది.
తనకు సంబంధించని అనవసరమైన పనుల్లో వేళ్ళుపెట్టి, దారినపోయే కష్టాలనన్నింటినీ కోరికోరి తలమీదకి తెచ్చుకోవడం బాగా అలవాటు అతనికి. అందుకే చైనాలో వున్న పటోలా బౌద్ధమత పీఠానికి వచ్చిన ఒకానొక ఆపదను కడతేర్చడం కోసం ఆవైపు ప్రయాణం చేశాడు.
ఆ కార్యాన్ని దిగ్విజయంగా నెరవేర్చిన తర్వాత ఒక పడవలో చైనాను వదిలి, కొరియా వైపు బయలుదేరాడు. చింజు పట్టణ పరిసరాల్లో బందిపోటు దొంగల దాష్టికానికి గురై అలమటించిపోతున్న ఆ ప్రజలను ఆదుకోవటానికి ప్రయత్నించి, అక్కడి పోలీసుల ఆగ్రహానికి గురయినాడు.
ప్రాణంలో ప్రాణమైన తన స్నేహితుడు గంగారాంతో కలిసి అతను చింజు పట్టణం నుంచి పరుగు ప్రారంభించాడు. ఎటు పోవాలో, ఎక్కడికి పోవాలో తెలియదు. వెనకనుండి వచ్చిపడుతున్న కొరియన్ పోలీసుల్ని తప్పించుకోవటమే ఆ సమయంలో అతను చేయవలసిన పని. ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది “రెడ్ షాడో” .
Red Shadow....Plot is really nice and. So griping and enjoy the entire journey of new world.
Warm Regards,
Vishnu
Nenu konni pustakaalu click chesaanu. vaatini pondalante ela please inform me to my E mail manyam_kavuri@rediffmail.com
KVKS Subramanyam