-
-
రెడ్ ఎలర్ట్
Red Alert
Author: Madhubabu
Publisher: Madhu Priya Publications
Pages: 394Language: Telugu
“మీరు మనసులో కోపాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నారు. జీతం డబ్బుల కోసం నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను. తప్పును నా నెత్తిమీద రుద్దటం భావ్యం కాదు.”
పార్థు మాటల్ని వినేసరికి అంతవరకూ ఉగ్గబట్టుకున్న కోపాన్ని ఆ పైన దాచుకోలేకపోయాడు గంగాధరం.
“మనసులో కోపాన్ని పెట్టుకొని మాట్లాడటం కాదు... నీ ముఖం మీదే ఆ కోపాన్ని ప్రదర్శిస్తాను. నా కొడుకు నిలబడిన ప్రదేశానికి పదిమైళ్ళ అవతల కూడా నిలబడే తాహతులేని ఒక అనామకపు ఆర్డనరీ రౌడీవి నువ్వు. నీ తాహతును తెలుసుకోకుండా పెద్ద హీరో మాదిరి ప్రవర్తిస్తావా? పోలీస్ స్టేషన్కి పంపటం కాదు, ఇక్కడికిక్కడే వళ్ళు నలగ్గొట్టి వీధిలోకి నెట్టిస్తాను. అడ్డుకోగలవా?” ఎర్రబడిన కనులతో సూటిగా చూస్తూ ఆ గది గోడలు దద్దరిల్లి పోయేటట్టు అరిచాడు.
సమాధానం యివ్వలేదు పార్థు. పెదవి విప్పితే అతను యింకా రెచ్చిపోతాడన్న అభిప్రాయంతో అలాగే మౌనంగా వుండిపోయాడు.
“మా అబ్బాయి గొలుసు లాక్కుని, అతనిచేత కాగితం మీద సంతకం పెట్టించగల మొనగాడివన్నమాట! నీ గొప్పతనం ఇంకా ఎలా వుంటుందో పోలీస్ స్టేషన్కి వచ్చి మరీ చూస్తాను” మాట మీద మాటగా అరిచాడు గంగాధరం.
