-
-
రియాలిటీ చెక్
Reality Check
Author: Poodoori Raji Reddy
Publisher: Tenali Prachuranalu
Pages: 394Language: Telugu
అట్లాంటి చోట్లనీ, అట్లాంటి వ్యక్తుల్నీ గురించి ఆలోచించడం 59 వారాలపాటు 'రియాలిటీ చెక్'గా సాక్షి ఫన్ డేలో అందించడం పూడూరి రాజిరెడ్డి చేసిన సాహసయాత్ర. దీనికి అవసరమైన సామగ్రీ సామర్థ్యమూ ఉండటం వల్ల ఒక రొటీన్ కాలమ్గా కాక ఇది తెలుగు వచనంలో ఒక 'ఎవర్లాస్టింగ్ ఎక్స్పెరిమెంట్'గా నిలిచిపోతుంది... ఇట్లాంటి రచన చేయడానికి ఉపయోగపడిన 'రా మెటీరియల్' వాక్యమే. వాక్య నిర్మాణంలో సవ్యసాచి అయితే తప్ప అది సాధ్యం కాదు. వాక్యాన్ని ఎన్ని రకాలుగా సుసంపన్నం చేయవచ్చునో అన్ని రకాలూ చేశాడు రాజిరెడ్డి.
- చింతపట్ల సుదర్శన్
అనాదిగా మానవజాతి అభివృద్ధి చేసుకున్న అన్ని సాహితీ ప్రక్రియల సారభూతమైనదేదో ఈ రచనల్లో ఉంది. పూర్వపు ఆశు సంప్రదాయం ధ్వనిస్తుంది. ఆధునిక రాత కథా లక్షణమూ పొడగడుతుంది. దృశ్యకావ్యపు లక్షణమేదో ద్యోతకమవుతుంది. అన్నింటినీ చదవడం పూర్తిచేసింతర్వాత ఇదొక భాగ్యనగరపు (అభాగ్యనగరపు) నవలగా కూడా అనిపిస్తుంది. అన్ని సాహితీ ప్రక్రియలు కలగలిసి ఒక సరికొత్త ఉత్కృష్ట సాహితీరూపంగా పరిణమించాయని కూడా నాకు అనిపించింది.
- తుమ్మేటి రఘోత్తమరెడ్డి
పూడూరి రాజిరెడ్డి తో ఈ పుస్తకం గురించి ఇంటర్వ్యూ:—
http://patrika.kinige.com/?p=1679