-
-
రవీంద్రుని గీతాంజలి
Ravindruni Geetaanjali
Author: Chilukamarri Ramanujacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 151Language: Telugu
కీర్తిశేషులు శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచారులను రసికలోకానిని పరిచయం చేయబూనడం సాహసమే అవుతుంది. తేనెలూరించే తన తేటతెలుఁగు కవిత్వంతో ఏనాడో సహృదయులైన తెలుగు పాఠకుల హృదయాల్ని చూరగొన్న మధురకవి.
ఆచార్యులవారు స్వతస్సిద్ధంగా నిరాడంబరజీవి. ఉపనిషద్విజ్ఞానంతో పండిన ఆయన మేధస్సునకు వైష్ణవ సంప్రదాయసిద్ధమైన భక్తిమార్గం గురుదేవుని గీతాంజలివంటి తాత్త్వికమైన కావ్యాన్ని తెలుగు చేయడంలో ఆయనకు అన్ని హంగులూ కూర్చిపెట్టింది. తత్ఫలితంగానే ఎంత సరళమో అంత మధురంగా ఈ కావ్యానువాదం సాగి ఈనాడు రసాస్వాదకులను రంజింపచేస్తూంది.
* * *
నీవు దేవుఁడ వంచెంచి నిలిచియుందు
దూరమునయందె, నీవు నా తీరె యంచుఁ
దెలిసి నీచెంత కే నరుదెంతునోయి!
తండ్రి వంచెంచి నీదు పాదాల మ్రోల
వాలుదుం గాని, నెచ్చెలివోలె నీదు
కేలు కేలను గీలింపఁ జాలనోయి ||
క్రిందికిం దిగి చిరతరప్రేమతోన
స్వయముగా వచ్చి నావాఁడ వయిన నిన్ను
నెదకు హత్తించి కౌఁగిటఁ బొదువుకొనెడి
సాహసమ్మది నామదిఁ జాలదోయి!
అరయ లేనోయి నిన్ సహచరుఁడ వంచు ||
సోదరులలోన నీవొక సోదరుఁడవె,
కాని వారల నేను లక్ష్యమ్మె సేయఁ,
బంచి యీఁ జాల వారికి సంచితమ్ము,
నిత్తు నీపొత్తుకొఱకు నాయెల్ల సొత్తు ||
పరుల సుఖదుఃఖభరమునఁ బాలుగొనక
నీ సమీపంబు నందున నిల్చియుందు,
ప్రాణములకుఁ దెగించెడి పనులఁటన్నఁ
గడుభయమ్మున గమ్మున ముడుచుకొందు,
కాని జీవన మనియెడి కడలియందుఁ
జప్పునం దూకు ధైర్యము చాలదోయి! ||
