• Ravi Kannulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రావికన్నులు

    Ravi Kannulu

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రావికన్నులు

సంక్షిప్త కవితలు

'రావికన్నులు' కవితాసంపుటిలో సమాజంలో నిత్యం మనకంటికెదురుగా కన్పించే వస్తువులను కవిత్వ సౌందర్యాలతో అక్షరపంక్తుల్లో నిబద్ధం చేసి తూటాలు పేల్చినట్టు వదిలారు మిత్రులు కవిశిరోమణి ఆచార్య రావికంటి వసునందన్‌.

ఇందులో సురేకారం దట్టించి కూర్చిన టపాసులా అధిక్షేపం నిగూఢంగా ఉంది. సమాజంలో తాను చూసిన కోణాలకి ఆవిష్కరణ ఉంది. భావ నైశిత్యం ఉంది. సరాసరి పఠిత గుండెలోపలికి బాణంలా దూసుకుపోయే గుణం ఉంది. లోక పరిశీలనా స్వభావం ఉంది. భాషాపటిష్ఠత ఉంది.

ఎంతో భావతీవ్రతగల పదజాలాన్ని దట్టించి సమాజంపై వదిలారు డా. వసునందన్‌. అందుకు సునిశిత పరిశీలన, భావ గంభీరత తోడయ్యాయి.

జీవన సమరంలోని నగ్నసత్యాలను అన్ని కవితల్లోనూ గుదిగ్రుచ్చారు. ప్రపంచంలోని వివిధ కోణాలను ప్రదర్శించారు.

'రావికంటి'కి బహువచనం 'రావికన్నులు'. రావి అంటే బోధి. రావి అంటే అశ్వత్థం (అశ్వత్థనారాయణం). ఫలశ్రుతిలో జ్ఞానవృక్షం. రావికన్నులు దాని అనేక కోణాలు.

సుతిమెత్తని వాక్యం వ్రాయాలంటే 'ధిషణ' కావాలి. అలాంటి ధిషణాహంకారం రావికంటిలో ఉంది. అలతి అలతి పదాలలో నూత్న భావావిష్కరణ చేయగల ధీశాలి రావికంటి.

- డా. ఆర్. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Ravi Kannulu