• Rani Gari Kathalu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 108
  120
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రాణీగారి కథలు

  Rani Gari Kathalu

  Author:

  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

Ranigari Kathalu

Sequel Stories by Saleem

రమణీయ రచన - 'రాణీగారి కథలు'

నవల అయినా, కథ అయినా కొత్తరకం కథా వస్తువుని తీసుకుని అద్భుతంగా రాసి మెప్పించగల మంచి రచయిత సలీం. ఇప్పుడు మతాంతర వివాహం చేసుకున్న హిందూ-ముస్లిం యువతీయువకుల జంట, తమ పెళ్ళి అయినప్పటినుంచి తమ పిల్లకి పెళ్ళి చేసే వరకు మత విశ్వాసాలతో ముడిపడిన కుటుంబాలతోనూ, రాజకీయాలతో నిండిన సమాజంలోనూ ఎటువంటి కష్టాలూ, సుఖాలూ అనుభవించారో 'రాణీగారి కథలు'గా రమణీయంగా రచించాడు సలీం.

కథానాయకుడు సైఫ్, కథానాయిక రాణి పాఠకుల మనస్సుల్ని దోచుకునేటట్లు ఉత్తమ పురుషలో కథలు వ్రాశాడు. పెళ్ళిళ్ళు 'ఘనంగా' చెయ్యడంలో పోటీలు పడుతున్న ఈ రోజుల్లో 'ఆకాశమంత పందిరి' వేసి, 'నక్షత్రాలు అక్షింతలుగా' కురిసేలాగ అందంగా పెళ్ళి ఎలా చెయ్యవచ్చునో ఆఖరికథ చదివితే తెలుస్తుంది. మత సామరస్యం ఎలా సాధించవచ్చునో సంసార పక్షంగా, సరళంగా, ఆహ్లాదకరంగా గీతావిష్కరణ చేస్తూ, 'మనసుకు లేదు మడి' అని బోధించాడు. మతానికి అతీతమైన మంచితనానికీ, ప్రేమకీ, మానవత్వానికీ ప్రతీకలు ఈ కథలు. రచయిత సలీం అన్ని విధాలా అభినందనీయుడు.

-అబ్బూరి ఛాయాదేవి

'వెండి మేఘం' నవలా రచయితగా శ్రీ సలీం చాలామంది తెలుగు పాఠకులకు పరిచితులే. సమాజంలోని అనేక చీకటి కోణాలను సున్నితంగా స్పర్శిస్తూ వెలుగు కిరణాలను ప్రసరింపజేసే శ్రీ సలీం కథలు సూటిగా సాగిపోయినా కిరణంలోని తరంగాల్లా కాంతిపుంజాల్లా ఆలోచనల్ని రేకెత్తిస్తాయి, మనసుని గాఢంగా హత్తుకుంటాయి.

'రచన' మాసపత్రికలో ధారావాహికంగా వచ్చిన 'రాణీగారి కథలు' పాఠకుల్ని ఎంతగానో అలరింపజేశాయి. ప్రేమ అనేది మనసుకు సంబంధించినదనీ, దానికి జాతి, మత, కులపరమైన వక్ర భాష్యాలు చెప్పరాదని సమాజంలోని ఛాదసులను, విద్యార్హతలున్నా సంస్కార రహితులను తర్కసహితంగా మందలించే శ్రీ సలీం 'రాణీగారి కథలు' తెలుగు కథా సాహిత్యాభిమానులను అలరిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

- ఎలక్ట్రాన్

పేర్ల చివర 'యస్ ' తగిలించుకొనో, మాటల్లో సెక్యులరిజంని నిత్యం స్మరిస్తూనో కనిపిస్తున్న రాజకీయాలు కళ్ళిపోయాయి గాని మనుష్యులు, సమాజం ఆరోగ్యంగానే ఉన్నాయని తెలియజేసే 'రాణీగారి కథలు' చెప్పిన శ్రీ సలీంగార్ని అభినందిస్తున్నాను. మంచిని మెచ్చుకోని నిర్పిప్తత మనకుండరాదని నమ్ముతూ ...

- కవనశర్మ

Preview download free pdf of this Telugu book is available at Rani Gari Kathalu
Comment(s) ...

it really reflects my life .. i was just feeling my love