• Rangante Ishtam Sahiti Chintanalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రంగంటే ఇష్టం - సాహితీ చింతనలు

    Rangante Ishtam Sahiti Chintanalu

    Pages: 344
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవితా హృదయం కలిగిన రచయితలు, కథ మనసు తెలిసిన కవులకు ఒక సౌకర్యం ఉంటుంది. వాళ్ళు ఏ విధమైన వచనం రాసినా, అది అందంగా, సాఫీగా, ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ప్రతి భాషకు తనదైన ఒక సొగసు ఉంటుంది. అందులో మాట తీరులాగానే రాసిన వాక్యానికి కూడా ఒక తీరు, పద్ధతి, తళుకుబెళుకులుంటాయి. ఆ ఒడుపు తెలిసినవారిలో తులసి గారు కూడా ఒకరని మనకీ వ్యాసాలు చదివితే అర్థమౌతుంది.

ఈ వ్యాసాలలో విషయం రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది తాను చదివిన కొన్ని రచనలలో తాను గ్రహించిన విశేషాలను పాఠకులకు అర్థమయ్యే విధంగా చెప్పటం. ఇది జలనిధిలో దాగిన రత్నాలను వెలికి తీసి, వాటితో హారం తయారుచెయ్యటం వంటిది. రెండవది జ్ఞాపకాల పుటలలోనుంచి విలువైనవాటిని సేకరించి, మనతో పంచుకోవటం. ఇది వాడిన పూలకు మళ్ళీ ప్రాణం పోసి, వాటితో దండ కూర్చటం వంటిది. ఇందులో ఏది చెయ్యాలన్నా ముందుగా కావలసినది సహృదయం, తన పరిసరాల మీద మమకారం, తన పరిచయాల పట్ల గౌరవం, తనను ఆకర్షించిన పాత్రల మీద అవ్యాజమైన ప్రేమ. తులసిగారిలో ఇవన్నీ సమపాళ్లలో సమృద్ధిగా ఉన్నాయని ఈ వ్యాసాలు చదవటం మొదలు పెట్టగానే మనం గ్రహిస్తాం.

- విన్నకోట రవిశంకర్

Preview download free pdf of this Telugu book is available at Rangante Ishtam Sahiti Chintanalu