-
-
రమ్య ద రోబో
Ramya The Robo
Author: Dr. P. Vijayalakshmi Pandit
Publisher: J.V.Publications
Pages: 110Language: Telugu
“రమ్య ద రోబో”లో కథావస్తువులు కొత్తవి. కథాకథనాలు రక్తి కట్టించాయి. విజయలక్ష్మి విద్యాధికురాలు. ఆవిడకి ఎన్నో విషయాలలో పరిజ్ఞానత, చదువు యిచ్చిన విస్తృత జ్ఞానంతో ఆవిడకి అనేక కొత్త కథా వస్తువులు, అని చెప్పే తీరులో తెలివితో కూడిన ఒక సృజనాత్మకత వుంది. ఆమెకి కథావస్తువుతో పాటు పాత్రల స్వభావాలు, హావభావాలు సులువుగా అర్ధమయి పాఠకులకి అందించే సౌలభ్యం వుంటుంది. అంచేత ఆమె కథనం పట్ల మరింత సునిశితంగా గమనించుకోవాలి.
- డి. కామేశ్వరి
"ఏమయినా రచయిత్రులలో విజయలక్ష్మి పండిటి గారు ఒక విలక్షణతనూ, వైవిధ్యాన్ని కలిగిన రచయిత్రి, ప్రపంచీకరణ పరిమాణాలు అవలోకనం చేసి, కథలుగా మలుస్తున్న విశిష్ట రచయిత్రి. ఈ కథలు చదవడం పాఠకులకు ఒక రసదర్శనం, భవిష్యద్గమనం."
- సుధామ
"రమ్య ద రోబో” మీ కథల సంపుటిలోని కథలన్నీ చదివాను. అన్నీ సున్నితమయిన , అంశాలను డీల్ చేశాయి. మీ శైలి సులువుగా వుంది. టెక్నాలజీ మనుషులను ఏమి చేయబోతోందో అన్న ఆందోళనను కథలతో ఆలోచింప చేయడం బాగుంది".
- ఖదీర్ బాబు

- FREE
- FREE
- FREE
- FREE
- ₹60
- ₹60