-
-
రామాయణం
Ramayanam
Author: A.N.Jagannadha Sharma
Publisher: Amaravathi Publications
Pages: 512Language: Telugu
నవ్య వీక్లీలో 'అరణి' కలం పేరుతో ధారావాహికగా వచ్చి అశేష భక్తవరులను ఆనంద పారవశ్యంలో ఓలలాడించిన "రామాయణం" మహాకావ్యానికి పుస్తక రూపమే ఇది. భాషలో సరళత, భావంలో సాంద్రత, హృదయోల్లాసం కలిగించే వాక్యవిన్యాసాలతో శ్రీ ఎ.ఎన్.జగన్నాథశర్మగారు ఈ మహాకావ్యాన్ని పండితపామర జనరంజకంగా మలచి మనకందించారు. మూర్తీభవించిన ధర్మమే శ్రీరామచంద్రుడు. శౌర్యపరాక్రమాలలోను, కారుణ్యభావనలోను, ధర్మనిరతిలోను, శిష్టరక్షణలోను శ్రీరామునకు సాటిరాగలవారు లేరు. అటువంటి స్వామి చరిత్రను ఎందరెందరో మహానుభావులు తమ భక్తిభావాన్ని అక్షరాలనిండా నింపి అందించడం ద్వారా మానవాళికి మహోపకారాన్నే చేశారు. ఆబాలగోపాలానికి అర్థమయ్యే భాషలో రచించబడిన ఈ పుస్తకం రామాయణ ప్రాభవాన్ని మరోసారి పాఠక హృదయాలలో ఆవిష్కరిస్తుందనడం సభక్తికంగా విన్నవించుకునే సత్యమే తప్ప అతిశయోక్తి మాత్రం కాదు.
గమనిక: "రామాయణం" ఈబుక్ సైజు 11.3 mb
Plz enable rental option