-
-
రామతత్త్వము
Ramatatvamu
Author: Chavali Anjaneya Murthy
Publisher: Chavali Anjaneya Murthy
Pages: 98Language: Telugu
రామాయణంలోని రామతత్త్వాన్ని హృదయదఘ్నంగా అనుభవించిన శ్రీ సీతారామాంజనేయ మూర్తి గారు దశరథంరాముడు, పావనరాముడు, జానకీరాముడు, శ్రీరఘురాముడు, జగదభిరాముడు, వనవాసరాముడు, ధార్మికరాముడు అనే శీర్షికలతో ఈ గ్రంథాన్ని సమకూర్చేరు. ఆయా శీర్షికలకు తగ్గట్లు రామాయణం నుండి విషయాన్ని సమగ్రంగా గ్రహించి వ్యాసరూపంలో నిరూపించేరు. గ్రంథం దశరథరాముడనే శీర్షికతో ఆరంభమైనది.
ధార్మికరాముడు అనే వ్యాసంతో పరిసమాప్తమైనది. శ్రీమన్నారాయణుడు దేవతలు మహర్షులు అభ్యర్ధింపగా దశరథ రామునిగా అవతరించేడు. వివిధ ధర్మాలకి ఆకారంగా నిలిచి ''రామో విగ్రహవాన్ ధర్మః'' అనే ప్రశంస పొందేడు. జనబాహుళ్యం అతణ్ణి ధార్మికరామునిగా కొనియాడుతోంది. ఈ విధంగా ఈ గ్రంథం ఆద్యంతాలు రెండూ సార్థకంగా సంతరింపబడ్డయి.
ప్రవృత్తి సార్వకాలికంగా సార్వజనీనంగా సమాచరణ యోగ్యమైనది. కాబట్టి ''రామాదివద్వర్తనీయమ్'' అనే సూక్తి ఎంతో ప్రసిద్ధిపొందింది. శ్రీ ఆంజనేయమూర్తిగారు రాముని చరిత్ర నేటి సమాజానికి ఏవిధంగా ఆదర్శమైనదో అడుగుగునా వివరించేరు. మార్గదర్శకమైనదని నిరూపించేరు. సమాజ పురోగతికి ఇటువంటి సమన్వయంతో కూడిన రచనలు అవసరమైనవి.
- వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి
Recently this author book 'Sundarakanda' published. Kinige please get that book?