-
-
రక్షణ శృంగము
Rakshna Srungamu
Author: Kiran Kumari
Publisher: Self Published on Kinige
Pages: 24Language: Telugu
పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. మృత్యువు నుండి వారిని విమోచింతును. మృత్యువు నుండి వారిని రక్షింతును. అని పాప దాసత్వమునకు లోనైన మానవాళిని విమౌచించుటకు ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అని ఆది నుండి పరిశుద్ద ప్రవక్తల ద్వారా భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప జేసియున్నాడు. అదేమనగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు మానవాళికి మారుమనస్సును పాపక్షమాపణను దయ చేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు. గనుక మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.
భూమి నెరలువిడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించును గాక, యెహోవానగు నేనే రక్షణ కలుగజేసియున్నాను.
- యెషయా 45:8
