• Rakshasudi Padaraksha Revised
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాక్షసుడి పాదరక్ష - రివైజ్డ్

    Rakshasudi Padaraksha Revised

    Author:

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

’రాక్షసుడి పాదరక్ష’ పేరుతో ఈ నీతి కథలు రాసిన డాక్టర్ సిరి, చెయ్యి తిరిగిన రచయిత్రి. రచయితలు అందరూ అన్ని రకాల కథలూ రాయలేరు. పత్రికల్లో కథానికలు వ్రాసేవాళ్లలో కొందరు మాత్రమే పిల్లల కథలు వ్రాశారు. రెండూ వ్రాయగలవాళ్లు కొంతమందే. ఆ కొంత మందిలో ఒకరు ఈ దంతవైద్యురాలు సిరి.

నా రచనలు చదివి, ముఖ్యంగా ‘నాగావళి నుంచి మంజీర’ చదివి, నా ఫోన్ నంబరు కనుక్కుని, నన్ను కలవాలని వచ్చింది. అంటే – నా అభిమానిగా. ఆమె వ్రాసిన కథా సంపుటాలు, నవలలూ చదివి నేను ఆమెకు అభిమానిగా మారాను! అదీ సిరి గొప్పతనం. డాII సిరి చాలా మంచి కథలు వ్రాసింది. పిల్లల కథలు ఎన్నో వ్రాసింది. పుస్తకాలుగా వచ్చాయి. సామాజిక అంశాలతో కూడిన కథలు, కథానికలు వ్రాసే విధానం వేరుగా ఉంటుంది. వాక్యనిర్మాణం, కథా వస్తువూ పెద్దల ఆలోచనలకి తగ్గట్టుగా ఉంటాయి. పిల్లలకి వ్రాసే కథలు అలా ఉండవు. వాళ్ల మనసుకి హత్తుకునేలా, తేలిగ్గా, ఉత్సాహభరితంగా ఉంటాయి. కథలో వర్ణనలు, వివరణలూ ఉండకుండా కథని నడిపించాలి. సిరి దగ్గర ఆ చాకచక్యం ఉంది. కల్పనా చాతుర్యంతో, నీతితో ఉండే కథలు వ్రాయడంలో, ఆమె చేతి కలం అందెవేసిన కలం!

డాక్టర్ సిరి ఇంకా ఇంకా ఎన్నో కథలు వ్రాయగలదు. సిరి, మంచి చదువుతుంది; మంచి వ్రాస్తుంది. కథలు కంచికి వెళతాయంటారు గాని, సిరి వ్రాసిన కథలు ‘మంచి’కి వెళతాయి.

- రావి కొండలరావు

Preview download free pdf of this Telugu book is available at Rakshasudi Padaraksha Revised