• Rakshaka Jananam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రక్షకజననం

    Rakshaka Jananam

    Author:

    Pages: 119
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

అర్ధరాత్రి. సమయం 2.00 గంటలు. క్రిష్ణన్‍కి మెలకువ రావడంతో పైకి లేచి చూసాడు. పిల్లాడు గాఢ నిద్రలో ఉన్నాడు కాని పిల్లాడి పక్కన మీనన్ లేదు. వెంటనే "మీనన్" అని పిలిచాదు కాని మీనన్ మాత్రం పలుకలేదు. వరండాలోకి వెళ్ళి చూడగానే అక్కడ మీనన్ ఆకాశం వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది. అది గమనించిన క్రిష్ణన్ తన వద్దకు వచ్చి మీనన్ భుజంపై చేయి వేశాడు. క్రిష్ణన్ చేయి తన భుజానికి తాకగానే ఆలోచన నుంఛి బయటకు వచ్చి క్రిష్ణన్ వైపు చూసింది.

"ఏంటి మీనన్ ఇక్కడ నిలుచున్నావ్ ఏమైంది? ఆరోగ్యం బాగానే ఉంది కద" అని ప్రశ్నలు వేసాడు క్రిష్ణన్.

కాని మీనన్ మాత్రం సమాధానం చెప్పకుండా క్రిష్ణన్ వైపే చూస్తోంది. మీనన్ ప్రవర్తన చూసిన క్రిష్ణన్‌కి మనసులో కాస్త భయం మొదలైంది.

"పిల్లాడు దొరికినప్పటి నుంఛి జరిగే పరిణామాలకు మీనన్ ఏమైన సమస్యకి గురైయిందా" అని ఆలోచిస్తూ, మరోకసారి మీనన్‌తో "ఏంటి మీనన్, అలా చూస్తున్నావ్" అని అడిగాడు.

"మనం ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాము" అని అన్నది మీనన్.

మీనన్ ఆ మాట అనగానే క్రిష్ణన్‍కి తాను చెప్పిన మాట ఒక భ్రమలాగ అనిపించింది. అసలు తాను ఆ మాట అన్నదా లేక నేనే వేరే విధంగా అర్థం చేసుకున్నానా అనే సందేహం తీర్చుకోవటానికి మరొకసారి "ఏంటి ఏమన్నావ్ మరొకసారి చెప్పు" అని అడిగాడు క్రిష్ణన్.

Preview download free pdf of this Telugu book is available at Rakshaka Jananam