-
-
రక్షా బంధం
Rakha Bandham
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 32Language: Telugu
ఈ దీర్ఘకవిత అనుబంధం ఊపిరిగా బ్రతుకుతున్న అన్నాచెల్లెళ్ళకు అంకితం.
* * *
దైవ వశమున ఓ జీవికి ఏదో ఓ సందర్భంలో మార్పు తధ్యం.... వారి ఆలోచనలు, ప్రవర్తనలు సరియైన దారిలో ప్రయాణించుటకు కావలసిన వత్తిడితో కూడిన కష్టసుఖాల సమాహారం జీవితం.... వజ్రం తయారవాలంటే దానిని ఎన్నో కోణాల నుండి తగిన విధంగా సాన పట్టవలసిందే.... బంగారం మాములు లోహంగా మెరుపును కలిగి ఉండదు.... భరించలేనంత ఉష్ణాన్ని తట్టుకొని నిలబడవలసిందే కదా... అలానే ఖర్మ వశానన్నో లేక పరిస్థితుల వలన పొందిన మార్పు వల్లనో ఉత్తమ జన్మలు "ఉత్త" మా జన్మలుగా అవుతున్నాయి.
ఓ మనిషి మంచితనంతో జీవించడానికి ఎన్నో ఒత్తిడులను తట్టుకొని నిలబడవలసి వస్తుంది. ఓ సందర్భములో చుట్టూ ఆధారములు కోల్పోయి ఆత్మీయ బంధాల కోసం ఒంటరిగా ఎదురు చూస్తుంటాడు. ఆ సమయంలో చేయూతనిచ్చే ఆధారమవ్వాలి.... ఆ కష్టాలను తట్టుకుంటూ మంచి సంస్కారాలను పొందుతాడు.
- నల్లా సాయిరెడ్డి
