• Rajeswari
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రాజేశ్వరి

  Rajeswari

  Author:

  Pages: 393
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

దొరస్వామి అయ్యరు ఉత్తరంలో నటరాజన్‌కి "మన రెండు కుటుంబాలూ కలుసుకోడానికి ఇది ఒక మంచి సమయం," అని రాసారు.
"చూసావా, పెళ్ళిచూపులకి వాళ్ళు వస్తున్నట్లు అతను నేరుగా రాయలేదు! చాలా చమత్కారంగా ఉంది అతని వ్రాత", అని నటరాజన్ ఆహ్లాదించారు.
"మనతో పెళ్ళి సంబంధం చేసుకోడానికి అతనికి ఇష్టం లేదేమో?" అని విశాలం అపనమ్మకంతో అడిగింది.
"ఏనాటికీ నిన్ను అనుమానం విడచిపెట్టదు. ఇష్టంలేకపోతే వాళ్ళెందుకు ప్రయాణం మార్చుకొని ఇక్కడకి రావాలి? అమ్మాయి ఫోటో చూసినతరువాత రావాలని నిశ్చయం చేసుకున్నారు. "
కాని విశాలంకి నమ్మకం రాలేదు.
"ఇదిగో, విను. మనం మితిమీరిన వైభవం, మర్యాదా చూపించి వాళ్ళని హడలుగొట్టవద్దు. వాళ్ళు మనింటికి స్నేహితులుగా వస్తున్నారు. మనమేమో పెద్ద నాటకం, తమాషా చూపిస్తున్నామని వాళ్ళకి అనిపించకూడదు. జ్ఞాపకం ఉంచుకో, ఇదేం అందరిలాగా అబ్బాయీ, అమ్మాయీ, అరగంటలో ఒకరినొకరు కలుసుకొని పెద్దలు నిశ్చయించే సంబంధం కాదు! నువ్వు సహజంగా, డాంబికం లేకుండా మెలిగితేనే వాళ్ళకి మనమీద మంచి అభిప్రాయం కలుగుతుంది. నువ్వు ఉత్తికే కలతపడి మనసు పాడుచేసుకోవద్దు."
విశాలం ముఖం చిన్నబుచ్చుకుంది. "నేనేం ఉత్తికే నాటకం ఆడుతున్నానా? నేను కంగారు పడడానికి కారణం లేదంటున్నారా? నేను చూపే అతిధి మర్యాద నిజం కాదా? నాకు నిజంగానే బెంగ పట్టుకుంది. నాకెవరున్నారు? నాకు మన దేశంలోని ఆచారాలు తెలియవు!" విశాలం ఎడతెగకుండా బాధతో గిలగిలలాడింది.
ఇంటిలో జరుగుతున్న ఈ ఘర్షణలు, వాదాలు విని రాజం కూడా దిగిలుపడింది. 'అమ్మ ఊరంతా నా పెళ్ళిగురించి చెప్పి తీరాలా? ఏం, ఎందుకు నాన్నగారి మాట వినదు? పొరుగింటి ఆవిడతో ఎందుకు మొత్తుకోవాలి? అంతే, ఆవిడ వాగుడుతో ఊరంతా తెలిసినట్టే!' అప్పుడే రాజంని ఒక పెద్దింటి స్త్రీ అడగడమైంది: "నీ రాబోయే అత్తగారు, అబ్బాయి, ఆడపడుచు వస్తున్నారటగా?"
'రఘుపతి! . . . రఘుపతి! . . . పేరు వినడానికి ముద్దుగా, కొత్తగా ఉంది! మరి చూడడానికి ఎలా కనిపిస్తారో?'
నటరాజన్ కూడా రాజంలోని కొత్త ధోరణి, చురుకుతనం గమనించారు; తనలో తనే చిరునవ్వు నవ్వుకున్నారు. ఆమె అక్కడక్కడ గోడలమీద ఉన్న ఫోటోలూ, పఠాలూ తీసి, శుభ్రంచేసి వేరే వేరే జాగాలలో తగిలించడం చూసారు. తన ముఖంలోని మొడతలు అసహ్యంగా కనిపిస్తున్నాయని కించపడుతూ వాటికి పరిహారంగా రాజం తల్లిని మీగడ అడగడంచూసి అతనికి కూతురుమీద జాలి కలిగింది. "కొంచెం నిమ్మరసం మీగడతో కలుపుకో!" అని సలహాకూడా ఇచ్చారు. కూతురు బాలికనుంచి యువతిగా మారే దశలో సాధారణంగా కానవచ్చిన తత్తరపాటు, చైతన్యం అతనికి అర్ధమైంది. అప్పుడప్పుడు అతను భార్యకి చెప్పారు: "'ఒక మనిషి ముఖంలో కనిపించే భావం, కళ్ళలోని చలనం చూస్తే చాలు. నోటినుండి మాటలు రాకపోయినా మనం వాళ్ళని అర్ధం చేసుకోగలం,' అనే సామెతకి మన రాజం మంచి నిదర్శనం."
కాని విశాలంకి ఆరాటం తగ్గలేదు; అతను మళ్ళీ అన్నారు.
"ఇదిగో చూడు. రాబోయే అతిధులు నీకోసం రావటంలేదు, మరి నీకెందుకు బెంగ? వాళ్ళు మంచి మర్యాదస్తులు. నువ్వు నీ పిరికితనం వదిలిపెట్టాలి. లేకపోతే నీకు ఎన్నాటికీ మనశ్శాంతి దొరకదు. ధైర్యంగా ఉండు."
"'కూతురులో తల్లి లక్షణాలు కనిపిస్తాయి,' అనే సామెత ఉందికదా? వాళ్ళకి తప్పకుండా నామీద ఒక కన్నుంటుంది." ఆ మాటలంటూనే విశాలం చిరునవ్వు నవ్వింది.

Preview download free pdf of this Telugu book is available at Rajeswari