• Rajani Sasankam
  • Ebook Hide Help
    ₹ 53
    59
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రజనీ శశాంకం

    Rajani Sasankam

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గంట సేపట్లో వచ్చేస్తానని చెప్పిన సతీష్ రాత్రి ఎనిమిదింటికి గానీ ఇల్లు చేరలేదు. మొహం వాడిపోయి, విపరీతంగా అలిసి పోయినట్లు వేలాడిపోతూ ఇంటికి వచ్చిన కొడుకుని చూసి ఆదుర్దాగా "ఎలా వున్నాడ్రా శశాంక్ ?" అని అడిగింది. మాలతి. “ఏముందమ్మా కొత్తగా? రెండేళ్లుగా నడుస్తున్నదే. మరీ పాడైపోయాడు వాడు ఇప్పుడు. ఏంటో ఇదంతా ?" అని నిట్టూరుస్తూ తన గదిలోకి వెళ్లిపోయాడు సతీష్. అంతవరకూ వింటూ కూర్చున్న రజనీకి వాళ్ళు మాట్లాడుతున్నది ఏమిటో అర్ధం కాలేదు. తల్లి వంక ప్రశ్నార్ధకంగా చూసింది. ఆమె ఏమీ చెప్పకుండా సుదీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ లేచి వంట గదిలోకి వెళ్లింది కాఫీ కలుపుతానని చెప్పి.

రిఫ్రెషయ్యాక వచ్చి తన ఎదురుగా సోఫాలో కూర్చున్న అన్నగారిని అడిగింది రజని. " ఏంటన్నయ్యా? నువ్వు సడెన్ గా ఢిల్లీ నించి రావటం, వచ్చీ రాగానే ఎవరినో చూడటానికి వెళ్ళటం ఏమిటి ? అసలు ఇప్పుడు నువ్వు వెళ్లింది ఎవరి దగ్గరకీ ?

" నా ఫ్రెండ్ శశాంక్ ని చూట్టానికి వెళ్ళారా తల్లీ ! " అన్నాడు సతీష్ "

శశాంకా ? ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది. అతనెక్కడ వుంటాడు ?" అని అడిగింది రజని.

“వాడు నీకు తెలియదులే. వాడు నేను స్కూల్లోనూ, కాలేజీలోనూ క్లాస్‌మేట్స్‌మి. నేను ఒక్కడినే వాడితో క్లోజ్ వుండేవాణ్ణి. వాళ్ళ డాడీ పోయాక శశాంక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి వాడే చైర్మన్. కోటీశ్వరుడు" అన్నాడు సతీష్.

ఆ మాటలు విని వులిక్కిపడింది. ఆ అమ్మాయి. "అంటే నేను మొన్న ట్రైన్లో చూసిన విండో మనిషా?" అని అడిగింది.

“విండో మనిషేంటీ?" అని అడిగాడు సతీష్. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో తను, తన ఫ్రెండ్స్ విశాఖపట్నం నించి వస్తున్నప్పుడు జనరల్ బోగీలో విండో సీట్లో కనిపించిన మనిషి గురించి, సికింద్రాబాద్ స్టేషన్‌లో అతని కారు డ్రైవర్ చెప్పిన వివరాల గురించీ తన అన్నకి చెప్పింది రజనీ.

అంతా విని "అవును వాడే. మొన్ననే అరకు వెళ్ళోచ్చానని చెప్పాడు నాకు" అన్నాడు సతీష్.

“అదేంటన్నయ్యా? అంత కోటీశ్వరుడయ్యుండీ బికారిలాగా, మెంటల్ కేసులాగా వున్నాడేంటీ?” అంది రజని.

బాధగా మొహం పెడ్తూ " వాడిదో పెద్ద కథ. వాడి కథలో అంతా విషాదమే తప్ప సంతోషం లేదు" అని చెప్పాడు.

ఇంతలో తల్లి ఇచ్చిన కాఫీని తాగుతూ ఏవో ఆలోచనల్లో మునిగిపోయాడు సతీష్. పిల్లలిద్దరి మొహాల వంక చూసి " ఏంటీ?" అని అడిగింది.

“శశాంక్ మొన్న దీనికి ట్రయిన్లో కనిపించాట్ట!” అన్నాడు సతీష్.

మాలతి ఆ మాటలు విని విచారంగా " అంతా వాడి దురదృష్టం” అని నిట్టూర్చింది.

రజనీకి శశాంక్ గురించి వివరాలు తెలుసుకుందామనిపించింది. కానీ తన తల్లీ, అన్న ఇద్దరూ ఏదో బాధలో వున్నట్టు చూసి నిశ్శబ్దంగా వుండిపోయింది తర్వాత వాళ్లే చెబుతార్లే అనుకుంటూ. కానీ ఆమె ఆశించినట్లు వాళ్ళు మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడకుండానే లేచి వెళ్లిపోవటంతో ఆశాభంగం చెంది తను కూడా తన గదిలోకి వెళ్లిపోయింది. తమ ఇంట్లో అన్నయ్య ఫ్రెండ్ గురించి ఇంతలా మాట్లాడుకోవటం ఎందుకో ఆమెకి అంతుబట్టలేదు.

Preview download free pdf of this Telugu book is available at Rajani Sasankam