• Rajakeeyalu Narisetti Innaiah
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రాజకీయాలు - నరిసెట్టి ఇన్నయ్య

  Rajakeeyalu Narisetti Innaiah

  Pages: 622
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలు

కులం పోవాలని ఎందరో ఉపన్యాసాలిస్తున్నారు. వ్రాస్తున్నారు. మరోవైపు కుల సంఘాలు కొత్తగా వెలుస్తున్నాయి. కులం ఏమిటని నిలదీసి అడిగితే వైజ్ఞానికంగా వివరించలేరు. చారిత్రకంగా కొంత వివరణ యివ్వడానికి అనేకులు ప్రయత్నించారు. కుల ప్రభావాన్ని గురించి ఇటీవల విదేశీ పండితులు కూడా వివరణలు వ్రాశారు.

లోగడ మత ప్రమేయంతో ముడిపడిన కులానికి, కర్మ పునర్జన్మ అనే రెండు దోషాలను అంటగట్టారు. పూర్వజన్మ కర్మల వలన యిప్పుడు ఫలానా కులంలో పుడతారన్నమాట. ఈ మూఢ నమ్మకాలపై ఇండియాలో ఎందరో సంస్కర్తలు దాడి చేశారు. అయినా జాడ్యం వదలలేదు. దీనికి పరిష్కారమార్గంగా కులాన్ని సూచించే పేర్లను తొలగించడం, కులాంతర పెళ్ళిళ్ళు చేసుకోవడం బాగుంటుందన్నారు. జనాభా లెక్కల్లో కులాల్ని అడగడం మానేశారు. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వారి పిల్లలు తండ్రి కులాన్ని చట్టరిత్యా పాటిస్తున్నారు. తదనుగుణంగా చట్టంలో మార్పులు చేయలేదు.

ప్రస్తుత కులానికి రాజకీయాలు తోడైనవి. ఇది కొత్తగా వచ్చి పడిన ప్రమాదం, 20వ శతాబ్దంలో అంటువ్యాధిలా ప్రబలిన యీ రుగ్మత ఎలా వ్యాపించిందో వివరించడం యీ రచనలో ముఖ్యోద్దేశం.

రాష్ట్ర రాజకీయ చరిత్ర

రాష్ట్ర రాజకీయాల విశ్లేషణ గత 40 ఏళ్ళుగా చేస్తూ వస్తున్నాను. అటు పార్టీలనూ, ఇటు ఉద్యమాలనూ పరిశీలిస్తూ పక్షపాత ధోరణి అవలంబించకుండా వాస్తవ విషయాలను ముందుపెడుతున్నాను. అలాంటి ప్రయత్నమే ఇప్పుడు కూడా జరిగింది. ఈ రచనకు అనేక ఆధారాలు స్వీకరించాను. విద్యార్థులకు ఉపయోగకారిగా ఉంటుందని కూడా ఈ ప్రయత్నంలో తలంపు ఉన్నది. రాజకీయాలను శాస్త్రీయంగా పరిశీలించటం జటిలమైన పని. అయినా అది అవసరం. అందుకు యధాశక్తి ప్రయత్నించాను.

నేను కలిసిన ముఖ్యమంత్రులు

ఆంధ్ర ఏర్పడినప్పటినుండి, తొలి భాషా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందిన తరువాత రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి చాలా కీలకమైన స్థానాన్ని ఆక్రమించటం స్పష్టంగా కనిపిస్తున్నది. పైకి అధికార వికేంద్రీకరణ, ప్రజలకు పెత్తనం అని నినాదాలిచ్చినా, చట్టాలు చేసినా అవేవీ అమలులోకి రాలేదు. రాష్ట్రంలో అధికారం అంతా ముఖ్యమంత్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా, కాంగ్రెస్ రాజకీయాలలో ముఖ్యమంత్రులు కేంద్ర నాయకత్వం చెప్పుచేతల్లో ఉంటున్నారు. అంత ప్రాధాన్యత సంతరించుకున్న ముఖ్యమంత్రుల గురించి వారితో గల కించిత్ పరిచయాల విషయాన్ని ప్రస్తావించటానికే ఈ రచన సాగింది. కొందరితో పైపైన, మరికొందరితో సుదీర్ణంగా, ఇంకొందరితో సన్నిహితంగా ఈ పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే రాజకీయ పార్టీలతో ముఠా రాజకీయాలతో సంబంధంలేని ఈ పరిచయాలను తెలియచేయటమే ఈ రచన ఉద్దేశ్యం.

- నరిసెట్టి ఇన్నయ్య

*****

ఇది నరిసెట్టి ఇన్నయ్యగారి రెండవ రచన. ‘రాజకీయాలు’ అనే ఈ పుస్తకం శాస్త్రీయ అన్వేషణలో... అనే మూడు భాగాల సంపుటిలోని ద్వితీయ భాగము.

Preview download free pdf of this Telugu book is available at Rajakeeyalu Narisetti Innaiah