• Rajahamsa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాజహంస

    Rajahamsa

    Author:

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1985లో రచించిన “రాజహంస”, 2010లో రచించిన “సాగరి” నవలికలను తమిరిశ జానకి ఒక్క చోట పుస్తకంగా ప్రచురిస్తున్నారు. “రాజహంస” ఆంధ్రపత్రికవారి పక్షపత్రిక “కలువబాల” నిర్వహించిన నవలికల పోటీలో బహుమతి అందుకున్నది. “సాగరి” ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో “మినీ నవల” విభాగంలో అచ్చయింది. రెండు నవలికలు నాయిక ప్రాధాన్యంగా నడిచాయి. నవలికల పేర్లు నాయికల పేర్లతోనే “రాజహంస”, “సాగరి” అని వున్నాయి.

తమిరిశ జానకికి కథను అల్లటం, కథను చెప్పటంలో నేర్పు వుంది. కథా కథనం పాఠకులను చదివించేట్లుగా ఉంటుంది. రచయిత్రి శైలి సరళంగా సూటిగా ఉంది. పాఠకులను ఆకట్టుకొని చదివించే శైలి. శక్తివంతమైన సందర్భోచితమైన సంభాషణలను వ్రాసి ఆమె నవలికల్లో కథా కథనాన్ని రక్తి కట్టించారు. పాత్రల చిత్రణ వాస్తవికంగా జరిగింది. రచయిత్రి తను చెప్పదలచుకున్న అంశాలకు ఉద్దేశాలకు తగిన విధంగా కథలను మలిచారు. ఇతివృత్తాలు పాఠకుల హృదయాలను కదిలిస్తాయి. కదలికను కలిగించటమే సాహిత్య ప్రయోజనం!

- ముదిగంటి సుజాతారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Rajahamsa