• Rajadhani Express
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాజధాని ఎక్స్‌ప్రెస్

    Rajadhani Express

    Pages: 196
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగులోనే కాదు మరే ఇతర భాషల్లోనూ రాని మొట్టమొదటి ట్రైన్‌ కిడ్నాప్‌ నవల "రాజధాని ఎక్స్‌ప్రెస్‌".

* * *

దబ-దబ దడ-దడ-దబ-దడ-

... వున్నట్లుండి తలుపు కీచుమంది. బయటకి క్లియర్‌గా తెలుస్తోంది. లోపల్నుంచి తలుపు తీస్తున్నట్టు- అంతా ఊపిరి బిగపట్టారు. ఆ బోగి తలుపు తెరుచుకుంది.

గార్డ్స్‌... సెక్యూరిటీ గార్డ్స్‌... చేతిలో ఆయుధం కూడ లేదు. నిర్మలంగా నుంచుని వున్నాడు. చూడగానే తెలస్తుంది. భద్రతా సిబ్బంది అధికారని - తన ముందున్న జనాన్ని పరికించి వంగి అటూ, ఇటూ చూశాడు. ఆ తర్వాత అందరిని ఉద్దేశించి అడిగాడు.

''ఎవరు... ఎవరీ పని చేసింది. వారు విధించే షరతులేంటో చెప్పండి''

ప్యాసింజర్స్‌ బుర్ర గోక్కున్నారు. ఓ ప్యాసింజర్‌ అడిగాడు.

''ఇంతకీ తమరెవరు బాబు. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్నడుగుతున్నారు''

''భారత వైమానిక దళానికి చెందిన సైనికుడిని. ఓ ప్రత్యేక శాసనం ద్వారా కొంత మందికి రక్షణగా వచ్చాను. ఇంతకీ ఈ ట్రైన్‌ని కిడ్నాప్‌ చేసింది ఎవరు? వారికేం కావాలి?''

''అది తెలియకే మీ బోగి తలుపు కొట్టింది''

''అంటే.. ఇక్కడ... ఇక్కడ ఈ ట్రైన్‌ని కిడ్నాప్‌ చేసిన వారి తాలూకు ఎవరూ లేరా?'' అడిగాడు ఆశ్చర్యంగా-

అంతా తల అడ్డంగా వూపారు.

ఆ గార్డ్‌ మరోసారి పరీక్షగా చూశాడు. క్రిందపట్టాల మీదే ట్రైన్‌వుంది.

కానీ చుట్టూ ఏదో కప్పి వుంది. చూడటానికి పలచగా వుంది.

''దాన్ని చేధించండి'' చూపించాడు గార్డ్‌.

''ఏంటి చేధించేది. కొట్టికొట్టి చేతులూ, తన్ని తన్ని కాళ్ళు పోయాయి. బయటికి దారి కనపడటంలేదు. ఈ ట్రైన్‌లో లైట్లు వెలగకపోతే వెలుగేలేదు. అసలిది పగలో రాత్రో కూడా అర్థం కావటంలేదు''

ఆ గార్డ్‌ తల పంకించి లోపలికి వెళ్ళబోతూ ఆగి- ''దయచేసి ఈ బోగి ఎక్కే ప్రయత్నం చెయ్యద్దు అలా ఎవరన్నా చేశారంటే మంచి చెడూ విచక్షణ లేదు. నిర్ధాక్షిణ్యంగా కాల్చిపారేస్తాం. లోపల వి.ఐ.పి.లు ఉన్నారు. వారి రక్షణే మా ప్రధమ కర్తవ్యం'' చెప్పి లోపలకెళ్ళాడు.

అందరూ గుసగుసలాడుకున్నారు. ప్రముఖులా ఎవరా ప్రముఖులు.. వాళ్ళ ఊహలు సగంలో ఉండగానే ఆ గార్డ్‌ తలుపు దగ్గరికి వచ్చాడు. అతని చేతిలో పవర్‌పుల్‌ గన్‌ ఉంది. ఎ.కె.47. ఉక్కుని సైతం తూట్లు తూట్లు చేయగల తుపాకి.. అంతా పక్కకి వచ్చారు.

ఆ గార్డ్‌ సూటిగా అడ్డుగా వున్న గోడవైపు గురిపెట్టాడు. అందరూ ఊపిరి బిగపట్టారు.

Preview download free pdf of this Telugu book is available at Rajadhani Express