• Rahasyam Last First Night
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రహస్యం ...లాస్ట్ ఫస్ట్ నైట్

  Rahasyam Last First Night

  Author:

  Pages: 48
  Language: Telugu
  Rating
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  4.38 Star Rating: Recommended
  '4.38/5' From 13 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 10 premium votes.
Description

*కొన్ని దశాబ్దాలకు పూర్వమే నిర్మించిన ఆ విల్లా రాజా స్వరణేంద్రభూపతి రాచరికానికి నిలువెత్తు సంతకం.
అలాంటి రాజవంశానికి సంబంధించిన రాజా స్వరణేంద్రభూపతి అనుమానాస్పదరీతిలో మరణించాడు. రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదనకు సరైన అన్వేషణలో వున్నారు పోలీసులు. అనుమానితులందరూ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు...
...కొన్ని వేలకోట్ల ఆస్తులను నిక్షిప్తపర్చుకున్న ఆ విల్లా రహస్యం ఏమిటి?
రహస్యం
*ఆరోజే వారి శోభనం.. అప్పుడే పిడుగులాంటి వార్త... శత్రువులు సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తున్నారు. శత్రువుల మీద సర్జికల్ స్ట్రయిక్ చేయడానికి అతడు మాత్రమే వెళ్ళాలి... ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక యుద్ధవిమానంలో బయలుదేరడానికి అతను సిద్ధమయ్యాడు.. అప్పుడే పెళ్లయింది.. శోభనం జరుపుకోవకలిసిన ఆ జంట స్లీపర్ కోచ్ లో బయల్దేరింది. ఎయిర్ పోర్ట్ చేరుకునేలోగా స్లీపర్ కోచ్ వాళ్ళిద్దరినీ.... ఎలా కలిపింది? స్లీపర్ కోచ్ శోభనం
*బ్లాంక్ చెక్ ...విలువైన ప్రాపర్టీ ....కళ్ళు జిగేలుమనిపించే స్వర్ణాభరణాలు ....వ్యాపార సంస్థల్లో షేర్స్...వాట్ నాట్... అవన్నీ చిన్న పెంకుటిల్లును స్వంతం చేసుకోలేకపోయాయి... తలక్రిందులైన అతని మహాసామ్రాజ్యం... కార్పొరేట్ ఎంపైర్ ఒకనాటి తన ఇంటి పనివాడి ముందు.... మోకరిల్లేలా చేసిన కథనం....కథ...విలువ
*పరమపిసినారి.. అయిన గోపాలం పనిమనిషిని పెట్టుకున్నాడన్నవార్త బ్రేకింగ్ న్యూస్... ఆ తర్వాత అతని లైఫ్ అనుకోని మలుపులు తిరిగింది… అదీ సంగతి
*ఒకరినొకరు అర్థం చేసుకుంటే అన్యోన్య దాంపత్యం. ఒకరినొకరు మోసం చేసుకుంటే దట్సాల్...
ప్రతీ కథకు ఎమోషన్ ఉంటుంది... ఎమోషన్స్ ను అక్షరాల్లోకి అనువదిస్తే
ప్రముఖరచయిత విజయార్కె
రహస్యం ...లాస్ట్ ఫస్ట్ నైట్ కథల్లోని వైవిధ్య కథాకథన కుతూహలం...
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Rahasyam Last First Night
Comment(s) ...

విభిన్నమైన కథలు చదవాలనుకునే వారికి విలక్షణమైన కథలు ...క్రైమ్ రొమాన్స్ సస్పెన్స్ కామెడీ మానవ సంబంధాలు..ప్రతీకథలో అంతర్లీనంగా ఆహ్లాదం ఆలోచన ...హేట్సాప్

రహస్యం కథ ఒక ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేస్తుంది.
*కొన్ని దశాబ్దాలకు పూర్వమే నిర్మించిన ఆ విల్లా రాజా స్వరణేంద్రభూపతి రాచరికానికి నిలువెత్తు సంతకం.
అలాంటి రాజవంశానికి సంబంధించిన రాజా స్వరణేంద్రభూపతి అనుమానాస్పదరీతిలో మరణించాడు. రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నాడన్న వాదనకు సరైన అన్వేషణలో వున్నారు పోలీసులు. అనుమానితులందరూ ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు...
...కొన్ని వేలకోట్ల ఆస్తులను నిక్షిప్తపర్చుకున్న ఆ విల్లా రహస్యం ఏమిటి?
అన్న వాక్యాలు కథను పాఠకులను రాజా స్వరణేంద్రభూపతి విల్లాకు చేరుస్తుంది.
డివోచి సర్పం గురించి చదువుతుంటే అడ్వెంచర్ థిల్లర్ కళ్ళముందు కనిపిస్తుంది.
ప్రతీ కథలో కొసమెరుపు ఉత్కంఠ ఆకట్టుకుంటుంది.

రహస్యం కథ ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తలపించింది.డివోచి సర్పం కూడా రహస్యంలో కీలకలైన పాత్ర పోషించడం రచయిత కల్పనాశక్తికి జేజేలు .ఒక ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది.ఇటీవల పొరుగురాష్ట్రంలో జరిగిన సంఘటన ఛాయలు ఆసక్తికరంగా ఇందులో కనిపించాయి.

రహస్యం కథ చదువుతుంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.డబ్బు ఎవరితోనైనా ఎంత పనైనా చేయిస్తుందనిపిస్తుంది.నిధి కోసం జరిగిన నేరంలో ప్రతీ సంఘటన రచయితా ఉత్కంఠభరితంగా రాసారు.ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.డివోచి పాము సన్నివేశం ఆ సర్పం కూడా ఓ పాత్రగా మారి కథకు కీలకంగా మారడం రచయిత సృజనాత్మకతే .
స్లీపర్ కోచ్ సున్నితమైన భావోద్వేగాలను స్పృశించింది.రొమాంటిక్ స్టోరీని ఇంత అద్భుతంగా రాయగలరా?యుద్ధాన్ని రొమాన్స్ ని బాలన్స్ చేసే వర్ణన సూపర్బ్.
అక్షరాల వెంట కళ్ళు పరుగెత్తించిన పుస్తకం.

అపరాధ పరిశోధనలో,థ్రిల్లర్ లో ది బెస్ట్ " రహస్యం" ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.ఉడుముతో డివోచి సర్పంతో కూడా కలిపి కథను నడిపించిన స్టైల్ అఫ్ రైటింగ్ స్కిల్ సూపర్బ్.కొత్త ఐడియా.ఒళ్ళు గగుర్పొడిచే థ్రిల్లర్ స్టోరీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినట్టు వుంది.
ప్రతీకథ రసాస్వాదన .విభిన్నమైన రచన.

VIJAYARKE Stories are going on in different way. Particularly the Story named 'VILUVA' is Valuable Story. When we start to reading, the Story will touch our heart. Owner and Servant character's are different. This is real 'VILUVA'.
- Adapa Chiranjeevi

VIJAYARKE Invested his valuable thoughts in 'RAHASYAM' Bood. That's why the Book stands in TOP TEN, again and again. That is POWER of VIJAYRKE.
- Adapa Chiranjeevi