-
-
రహస్యం
Rahasyam
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 367Language: Telugu
"పెద్దింటి బిడ్డ అయివుండి కూడా అలా వట్టి గట్టుమీద ఎలా పడుకున్నారో చూడు...." రాములు చెవి దగ్గిర చేరి గుసగుసలాడింది గోవిందమ్మ.
"నీయవ్వ..... నువ్వునోరు మూసుకోవే....సిద్ధుబాబు సంగతి నీకు సరిగ్గా తెలియదు. ఆ బాబు ఏ పనైనా చేయగలడు... కిందికి చూడకుండా ఠీవిగా కారులో తిరుగుతాడు... తిరిగి మన మల్లేశంతోపాటు చెత్తకుప్పల మధ్య లెప్ట్ రైట్ కొడతాడు... దేనికైనా సమర్థుడు..." అంటూ ఆమె నోటిని గట్టిగా అదిమాడు రాములు.
"నాకేదో భయంగా వుంది. ఈ గొడవంతా ఆ రంగూన్ భాయ్ తెలిసి, ఆడు నన్ను గుర్తుపెట్టుకుంటాడేమో!" పదినిముషాలు ఆగిన తరువాత తన సొదను మళ్ళీ మొదలుపెట్టింది గోవిందమ్మ.
"నిన్నా రంగూన్ భాయ్ గుర్తుపెట్టుకోవటమా? దగ్గిర వున్నప్పుడు సిద్ధుబాబు నీకు ఈ వేషం వేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోయినట్లయితే నువ్వెవరినో నాకు తెలిసేది కాదు" అన్నాడు రాములు.
"ఆ రంగూన్ భాయ్ పెద్ద జాదూ.... ఈ గొడవ అయ్యాక ఆడు పగబట్టి ఏదయినా జేస్తే?" అందామె.
"పీడా వదిలిపోతుంది. సినిమాలని, వేషాలని నువ్వు బజార్ల వెంట తిరుగుడు లేకుండా పోతుంది. నాకు చాలా ఖుషీగా వుంటుంది" అన్నాడు రాములు.
Good Read but not great. If ending is good novel in another level.