-
-
రఘుపతి వెంకయ్య - సినీ వారసులు
Raghupathi Venkaiah Cine Varasulu
Author: Lakshmana Rekha N. Gopalakrishna
Pages: 60Language: Telugu
సినిమా చరిత్ర రాయడం చిన్న పని కాదు. అందరూ రాయ లేరు - సినిమా మీద అభిమానంతో, అనుభవంతో, ఒక లక్ష్యసాధన గలవారు, చరిత్ర పది కాలాలపాటు అందరికి గుర్తుండాలనే ధ్యేయంతో కొందరే దీనికి పూనుకుంటారు. అలాంటి వారిలో లక్ష్మణరేఖ గోపాలకృష్ణ ఒకరు. వారి 50 సం॥ సినీ స్వర్ణోత్సవ సందర్భంగా ఇటువంటి రచనలు రావడం సినిమా అభిమానులకు ఒక వరం.
ఈ అవార్డు గ్రహీతల గురించి ఒక్కొక్కరిపై ఒక్కొక్క పుస్తకం రాసేటంత సమాచారం ఉంది. కాని ఈనాటి పాఠకులకు అంతటి ఓపిక లేదని అందరికీ తెలుసు - అందుకే అనుకుంటా నిర్మాత, దర్శకులు గోపాలకృష్ణ గారు క్లుప్తంగా వారి జీవిత విశేషాలను ఈ పుస్తక రూపంలో ప్రచురించారు.
మరొక్క మాట: రఘుపతి వెంకయ్య - సినీ వారసులు అనే శీర్షిక చాలా భావయుక్తంగా, విశేషాన్ని సూచిస్తోంది. వెంకయ్య - ప్రకాష్ గార్ల కృషి తెలుగు సినిమాకి నాంది అయితే ఈ అవార్డు గ్రహీతలు వెంకయ్యగారి అడుగు జాడల్లో నడుస్తూ వారి వారి పాత్రలను పోషిస్తూ, తెలుగు సినిమా అభివృద్ధికి తోడ్పడిన తీరు మనకు తెలుస్తుంది. అందువల్ల ఈ పుస్తకం ఆ టైటిల్‌కి నోచుకుంది. అందుకు నిట్టల గోపాలకృష్ణ అభినందనీయులు.
- పి. చంద్రశేఖర్ రెడ్డి
సినీ దర్శకులు

- ₹108
- ₹60
- ₹270
- ₹60
- ₹60
- ₹60