-
-
క్విక్ రెమిడీస్
Quick Remedies
Author: Dr. G.V.Purnachandu
Publisher: Sree Shanmukheswari Prachuranalu
Pages: 89Language: Telugu
ఆయుర్వేదశాస్త్రంలో సామాన్యులకు సైతం ఉపయోగపడే అనేక విలువైన అంశాల్ని ఏరి, ఆయుర్వేద వైద్యుడిగా ఇన్నేళ్ళ పరిశోధనల్ని, పరిశీలనల్ని, అనుభవాల్ని జోడించి, ఈ పుస్తకంగా రూపొందించడం ద్వారా ప్రజల్లో వస్తున్న చక్కటి మార్పుని శాశ్వతం చేయాలనేదే నా తపన! అది ఒక రచయితగా నా బాధ్యత కూడా!
తక్షణ నివారణ కోసం చిటికెలో పనిచేసే చిత్రమైన చికిత్సల సమాహారం ఈ ''క్విక్ రెమిడీస్'' సామాన్యుల నుంచి అసామాన్యుల ద్వారా ప్రతిఒక్కరూ తమకు తాముగా చేసుకోగలిగే అద్భుత చికిత్సలు ఇందులో వున్నాయి.
ఇవి మీ వ్యాధుల్ని తగ్గిస్తాయి.
మీరు వాడుకుంటున్న మందులు త్వరగా పనిచేసేలా చేస్తూ, మీ చికిత్సా కాలాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి.
మీరు వాడుతున్న మందుల వలన కలిగే చెడు ఫలితాలను నివారిస్తాయి.
అందరికీ అర్ధం అయ్యే భాషలో అత్యంత సరళంగా రాసిన ఈ చికిత్సల్ని ఏదో కాలక్షేపం కోసం చదవడంగా కాకుండా, అవసరానికి సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను.
- డా. జి.వి.పూర్ణచందు
