-
-
పుస్తకపాణీ శతకము
Pustakapani Satakamu
Author: Marumamula Dattatreya Sarma
Publisher: Darshanam Magazine
Pages: 46Language: Telugu
శతకము అనేది తెలుగు భాషకు మకుటప్రాయమైనది. శతకములో మకుటము ప్రాధాన్యముగా నుండును. ఇది పద గతము, అర్థపాద గతము, సంపూర్ణ పాద మకుటములు గలవి పెక్కులు గలవు కూడా. ఇవి చెప్పదలచిన నీతిని, వైరాగ్యాన్ని భక్తిని ప్రకటించేవి కూడా కోకొల్లలు. “మనసా! హరిపాదము లాశ్రయింపుమా” తత్త్వప్రబోధకమైనవి ఎంతో పేరుగన్నవి.
ఇక ఈ కవి శ్రీ దత్తాత్రేయశర్మగారు లబ్ధప్రతిష్ఠితుడైన సాహిత్య ప్రియుడు. సాహిత్యమెక్కడుంటే అక్కడికి (ఎంత దూరమైనను) పరుగెత్తే వ్యక్తి ఆయన. రసాలంబనకు మనసిచ్చే మనస్తత్త్వమాయనది. సుతిమెత్తని హృదయంతో, నవ్వులొలుకు సంభాషణలతో ఎదుటివారి మనస్సు నాకట్టుకొనే కట్టుబాటుగల వ్యక్తిత్వము. చాలా కాలానికి ఒక శతకము వ్రాయాలనీ, దాన్ని ఆధ్యాత్మికమూర్తియైన శ్రీ మాధవానంద స్వామి పదకంజముల యందర్పించాలనే తపనతో వ్రాసిన, “పుస్తకపాణీ!” మకుటముతో కృతకృత్యత, కృతికత్యత సాధించినారు.
- అష్టకాల నరసింహరామశర్మ

- FREE
- ₹60
- ₹60
- ₹194.4
- ₹50.00
- ₹50.00