-
-
పుష్కర వైభవ శతకమ్
Pushkara Vaibhava Satakam
Author: Ramulu Sadhula
Publisher: Self Published on Kinige
Pages: 55Language: Telugu
ఈ కవితాపుష్పము ''పుష్కరవైభవ శతకము'' లో ''కరినగరవాస గిధర గరుడగమన'' అను మకుటము పేరున రచించినాను. సీసపద్య ఛందస్సులో తెలుగు భాషలో సులువుగా అర్థమగునట్లు తెలుగు ప్రజలకు పుష్కర వైభవ శతకము అందించుచున్నాను.
పన్నెండు రాశులు, పన్నెండు ముఖ్య నదులకు ఎప్పుడెప్పుడు నది పుష్కర పర్వదినములు వచ్చునో సంక్షిప్తముగా పద్య రూపమున వివరించినాను. పుష్కరమనగా పవిత్ర జలము. పేరు పొందిన దేవాలయములకు ఒక పుష్కరిణి (కోనేరు) ఉంటుంది. కాని ఇది నది పుష్కరాలు. గురుడు మరియు పుష్కర పురుషుడు ప్రతి సంవత్సరము ఒక రాశి ఒక ముఖ్య నదిలో ప్రవేశించ ము పుష్కర పర్వదినములందురు. పుష్కర పర్వదినములు 12 దినములు. ఆ ముఖ్య నదులు గంగానది, యమున, సరస్వతి, నర్మదా, పుష్కరిణి, సింధూ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, భీమరధి మరియు ప్రాణహిత నదులకు మాత్రమే గురు పుష్కరుల ప్రభావముండును. ప్రత్యేక దినములలో ప్రవేశమునే పుష్కరమందురు.
- ప్రచురణ కర్తలు
