-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
పూర్ణిమ (free)
Purnima - free
Author: K. Seshaiah
Publisher: Self Published on Kinige
Pages: 222Language: Telugu
Description
ప్రకృతి, జీవుడు ద్వంద్వమయం. ఏ ద్వంద్వమైనా ఒకటి లేకుండా మరొకటి ఉండదు. అది వుంది అంటే ఇది వుంది. ఇది లేదంటే అది లేదు. ఈ సత్యాన్ని ఆవిష్కరించడానికి వేదాంతం కూడా ‘మాయను’ ‘భ్రమను’ ‘లీలను’ ఆధారం చేసుకొన్నది. ఏది ఏమైనా, మానవని ఉత్కృష్టమైన ఆశయం ఆనందం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి, ఈ సృష్టిలో పుట్టిన ప్రతిజీవి నిరంతరాయంగా కృషిచేస్తున్నది. కాని అది ఎండమావుల వెంటపరిగెత్తడమేనని ఋజువవుతున్నది. ఇది ఒకయుద్ధం, లంపట, తంతు. అయినా జీవిత లక్ష్యాల దృఢత్వాన్ని బట్టి, ప్రయత్నాల పెళుసుతనం పెరుగుతుంది. ఈ జీవన సమరంలో, శూన్యాన్ని పూర్ణాన్ని కలబోసితే, ఉద్భవించేది ప్రేమ, త్యాగం. అలాంటి ప్రేమ త్యాగం, పెనవేసుకున్న ఇతివృత్తం ఈ ‘పూర్ణిమ’.
పూజ్యునీయులైన ఆచార్య శేషయ్య కందమూరు గారికి నమస్కరించి వ్రాయడమేమనగా kinige.com లో మీరు వ్రాసిన "పూర్ణిమ (2017) " అను పుస్తకాన్ని నేను చదివాను. నాకు ఇంతవరకు తెలియని తెలుగు పదాలను నేను చదివి అర్థం చేసుకున్నాను, మరియు కవిత్వాన్ని చాలా చూడ ముచ్చటగా వ్రాశారు. కొన్ని పదాలు నాకు అర్థం కాలేదు, అవి మా నాన్నగారికి అడిగి కనుక్కున్నాను. మీరు వ్రాసిన శైలిని మరియు మీరు పూర్ణిమను మొదటి సారి చూసిన సన్నివేశాన్ని వర్ణించడం గురించి మా అమ్మ-నాన్నలకు నేను చదివి వినిపించాను. కొన్ని సన్నివేశాలలో కన్నీరు ఆగలేదు. ఇలాంటి మంచి పుస్తకాన్ని వ్రాసి ఫ్రీగా ఇప్పుడు విడుదల చేసినందుకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
యస్. శ్రీధర్.