-
-
పురాతన పుణ్య గ్రంథ నిధి
Puratana Punya Grantha Nidhi
Author: Mydhili Venkateswara Rao
Pages: 400Language: Telugu
సత్య యుగంలో ధర్మం నాలుగుపాదాలమీద నడిచింది... నరకలోకం ఖాళీగా ఉండేది. ఆ తరువాత త్రేతాయుగంలో మూడు పాదాలమీదా, ద్వాపరయుగంలో రెండుపాదాల మీదా ధర్మం నడిచేది... కాని ఈ కలియుగంలో ధర్మం ఒంటిపాదం మీద... ఇంకా చెప్పాలంటే కుంటు కుంటూ నడుస్తోంది.
ఎటు చూసినా మోసం... ధనం... లేదా స్త్రీ... ఈ రెండింటితో పాటు ఈర్ష్యా, అసూయలు... శాడిజాలు... ఇలా ఎన్నో ప్రతి క్షణం తెలిసిచేసే పాపాలు... తెలియక చేసే పాపం... విత్తనాలు చల్లితే మొక్కలు మొలవటం ఎంత సత్యమో ప్రతి చర్యకి పాపం, పుణ్యం వస్తుందనేది అక్షర సత్యం...
చేసిన ప్రతి పాపానికి ఇక్కడే భూమిమీద శిక్ష అదీ నరక యాతనలు అనుభవించాలి. అక్కడ పైన ఖాళీ లేదు. అందుకే ఈ కలియుగంలో వ్రత పూజ యజ్ఞ, ధర్మ, దాన, కార్యాల ద్వారా పుణ్యాన్ని పొందాలి.
కొన్ని పాపాలకు, దోషాలకీ పరిహారం చేసుకోవాలి. ఆపై ఎలాంటి కీడు ఎవ్వరికీ చేయకూడదు. ఎంతటి ద్రోహం చేసిన వారినైనా క్షమించాలి. వదిలెయ్యాలి.
కత్తికి కత్తిలా సమాధానం చెప్పుట ద్వారా మానసికంగా, శారీరకంగా ఆయుష్షు పరంగా కూడ క్షీణించే పరిస్థితి వస్తుంది. దుష్టులను, దూరంగా ఉంచండి.
ముక్కూ మొహం తెలియని వారి నుంచి ఏ ప్రమాదమూ, ఏ నష్టమూ, ఏ అగౌరవమూ రాదు. చుట్టూ ఉన్న వారి నుంచే, పక్కనున్న వారి నుంచే ఏం వచ్చినా. కాన ధనం విషయంలో, స్త్రీల విషయంలో, గౌరవం విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తులై, ధర్మ కార్యాల ద్వారా జీవిస్తే అమృతపానం సేవిస్తే కలిగే సుఖం...
స్నేహితుణ్ణి మోసం చేస్తే... పరస్త్రీని కోరితే... ఆడపిల్ల సొమ్ముకు ఆశపడితే... అనుభవించే క్లేశాలను ఈ గ్రంథంలోనే వివరించాను. చక్కని సంసారము... కీర్తి తెచ్చే పుత్రులు... అపార ధన సంపదల కోసం చెయ్యాల్సిన విధులతో పాటు సంతానం లేకపోతే చెయ్యాల్సిన ధర్మ విధులు గూర్చి ఇలాంటి ఎన్నో పాపాకీ, దోషాలకీ కూడా తెలియచేశాను.
యజ్ఞం ద్వారా, వ్రతాల ద్వారా సంతానము, ధనం వస్తుందా! అన్న ప్రశ్నలకి నేను చెప్పేది వక్కటే... యజ్ఞం ఆవునెయ్యితో, దర్భలతో అనేక ధాన్యాలను మండిస్తూ చేస్తారు. ఆ మంత్రాలకీ.... ఆ నియమనిష్టలకీ, యజ్ఞ ధూపపొగలకి శరీరం చైతన్యం చెందుతుంది. అపూర్వ శక్తి వస్తుంది.
అది చాలదా సంతానం కలగటానికి...ఆ శక్తి చాలదా... ధనం సంపాదించటానికి... కావున పుణ్యాలూ, దానాలూ, వ్రతాలూ చేయండి. అందరూ సుఖంగా ఉండండి.
- మైథిలీ వెంకటేశ్వరరావు

- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28