• Puranalu Kulavyavastha 5 Ramayana Munulu
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 60
  60
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పురాణాలు కుల వ్యవస్థ - 5: రామాయణ మునులు

  Puranalu Kulavyavastha 5 Ramayana Munulu

  Pages: 100
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

పురాణాలు కుల వ్యవస్థ - 5: రామాయణ మునులు - మతంగుడు, విశ్వామిత్రుడు, శంబూకుడు

రచన: డా. విజయభారతి

రామాయణ కాలంలో ప్రజలకూ మునులకూ మధ్య ఉన్న ధార్మిక సంబంధాల గురించీ యోగాభ్యాస నిరతి గురించీ ప్రస్తావిస్తున్న ఈ పుస్తకం కొన్ని కొత్త కోణాలను కూడా ఆవిష్కరిస్తున్నది.

రామాయణాన్ని ఒక కావ్యంగానూ మత గ్రంథంగానూ కాకుండా సామాజిక దృష్టితో పరిశీలిస్తే ఎన్నెన్నో కొత్త అంశాలు ప్రకటితమవుతూ ఉంటాయి. రాముని కథలో అనేక కథలున్నాయి.
మునుల కథలు, అసురుల కథలు - శాపాల కథలు - వీటితోబాటు శాస్త్ర చర్చలు - ధర్మాధర్మ నిరూపణ యత్నాలు చాలా కనిపిస్తాయి. మునుల కథల ఆధారంగా అప్పటి వర్ణధర్మాన్ని విద్యావ్యవస్థను పరిశీలించటం ఈ గ్రంథం లక్ష్యం. ఈ కోణంలో పరిశీలనకు మతంగ, విశ్వామిత్ర, శంబూకుల కథలు ప్రధానంగా గ్రహించటం జరిగింది.

శ్రమ విలువను ఎంతో గొప్పగా విశ్లేషించిన మార్క్స్‌ మహాశయుని కంటే శతాబ్దాల ముందరే ''శ్రమ నుండి ఎదిగినది నశించదు'' అంటూ రాక్షసుడుగా చెప్పబడుతున్న కబంధుడు రామునికి చెప్పాడనటం మతంగ సంస్కృతిని గురించి ఆలోచనలను రేకెత్తిస్తుంది.

* * *

డా. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి.

Preview download free pdf of this Telugu book is available at Puranalu Kulavyavastha 5 Ramayana Munulu
Comment(s) ...

శ్రీమతి విజయభారతి గారు వ్రాసిన పుస్తకాన్ని ఎంతో ఉత్సాహంతో కొని చదివాను. కాని ఇంకో పాశ్చాత్య వామపక్ష ప్రచార వాదం అని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు.

ఉదాహరణకి మాతంగుని కథను చూస్తే రచయిత్రి ఎక్కడినుంచి ఎక్కడికో వెళ్ళిపొయారు. నూతన శాశ్త్రీయ పరిశొధనలు ఈ వామపక్ష భావాలని ఖండిస్తున్నాయి.

1. జన్యు పరిశోధనలు ఆదిమ మానవుడు భారతదేశం నుండి యూరోపు వెల్లాడు కాని అటునుంచి ఇటు రాలేదు.

2. ఆర్యుల ఇన్వేజన్ (అక్రమణ) మరియు ఆర్యుల మైగ్రేషన్ (వలస) రెండు వాదాలు కూడా తప్పే. ఆర్య డ్రవిడ భెదం పాచాత్య కల్పితం. రాముడు ఇక్ష్వాకుదు, ప్రస్తుత ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వెళ్ళిన వారు. ఆ విధంగా రాముడు ద్రవిడుడు, రావణుడు బ్రాహ్మణుడు. ఎవరు ఎవరిని చంపారు?

3. ఇంద్రుడు చెప్పినట్లు సత్బ్రాహ్మణ లక్షణాలు శాంతి, దయ, సౌభ్రాత్రుత్వం మరియు అద్వైతం (అన్ని ప్రాణులలోను దైవ దర్శనం). మాతంగుడు అవి సాధించిన రొజు అతను సత్-బ్రాహ్మణుడు అవుతాడు, విశ్వామిత్రుడు లాగ. కానంత కాలం అతడు కూడా కుల బ్రాహ్మణుడు మాత్రమే అవుతాడు.

అసలు మన సమాజం యొక్క ముఖ్య గమ్యం ఏమిటి? సమ సమాజం అంటే ఏమిటి? మనం బ్రాహ్మణులు అని పిలుచుకునే వారిని బ్రాహ్మణులుగా ప్రవర్తించడమా లేక, బ్రాహ్మణులుగా ప్రవర్తించే వారిని మాత్రమే బ్రాహ్మణులుగా పిలవడమా?

మనకి కావలసింది బ్రాహ్మణ ప్రవర్తన సమాజం నుండి, బ్రాహ్మణ కులం కాదు. ఆలాగె క్షత్రియ ప్రవర్తన, కులం కాదు. వైశ్య ప్రవర్తన, కులం కాదు. సమాజానికి కావలసింది ఒక విశ్వకర్మ, మయ లాంటి (ఇంజినీరింగ్) శూద్రులు, కంచ ఐలయ్య లాంటివారు కాదు. కంచ ఐలయ్య లాంటివారు సమాజానికి మరియు దేశానికి ఏమి ఉపయోగం లేదు, వారు శూద్రులయినా లేక హిందువులయినా లేక క్రైస్తవులయినా.

పాఠకులు గ్రహిస్తారని భావిస్తూ!