-
-
పురాణ కథలు
PuranaKathalu
Author: Prayaga Ramakrishna
Publisher: Prayaga Ramakrishna
Pages: 218Language: Telugu
Description
పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శక సూత్రాలను పేర్కొంటాయి. ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి.
ఎప్పుడో జరిగిన గాథలను పురాణాలద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి వుంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను ఋజుమార్గంలో నడిపిస్తాయి కనుక. మంచిపనులు చేసి లోకోపకారం కలిగించి తరించిన మహనీయుల జీవితాలను చదివి ఆకళింపు చేసకొని సత్కర్మలు చేయడానికి మనమూ ముందడుగు వేస్తాం. చెడుపనులు చేసి పతనమైన వారి కథలు చదివి దుష్కర్మలకు దురంగా వుంటాం.
పురాణాలన్నీ మనం ఆచరించాల్సిన ధర్మాలను కథారూపంగా వివరిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలను, ఆచరించకపోతే కలిగే అనర్థాలను తెలియజెబుతాయి. ప్రతీ మనిషి నిష్కామంగా స్వధర్మాచరణా చేయాలని బోధిస్తాయి.
Preview download free pdf of this Telugu book is available at PuranaKathalu
Login to add a comment
Subscribe to latest comments
