• Purana Pralapam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పురాణ ప్రలాపం

    Purana Pralapam

    Publisher: Vemana Foundation

    Pages: 291
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవ సమాజం ఒక జీవనది లాంటిది. నది స్థూల దృష్టికి నిశ్చలంగా కనిపించినా నిరంతరంగా అందులోని నీరు మారుతూ ప్రవాహ వేగంతో ముందుకు సాగుతూ ఉంటుంది, దారిలోని మిట్ట-పల్లాలు అవగాహన చేసుకుంటూ తన దారిని ఏర్పరుచుకుంటుంది. అలాగే ఒక సమాజం తన ఒరవడిలో కొన్ని ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరచుకుంటుంది. వాటి అవసరం తీరిన తర్వాత కాలానుగుణంగా వాటిని వదిలేస్తూ లేదా మార్చుకుంటూ ముందుకు పోతుంది. అలాంటి మానవ సమాజానికొక చరిత్ర, సంస్కృతి ఉంటాయి. వాటి స్వరూప-స్వభావాలకు ప్రస్తుత వారసులు కారకులు కారు. అయితే పుట్టిన ప్రతివాడూ వారసత్వంగా వచ్చిన విభజన రేఖల్లో, వర్గీకరణల్లో ఎక్కడో ఒక దగ్గర పడక మానడు.

విమానం ఆకాశంలో ఉన్న మబ్బుల్ని ఛేదించుకొని పైపైకి పోయి నిర్మలాకాశ వీధిని చూడగల్గినట్లు, మనం రాగద్వేషాలకతీతంగా, మానవశాస్త్ర దృష్టితో, చారిత్రక నేపథ్యాన్ని, సమాజ నియమావళిని, అందులో వచ్చిన, వస్తున్న మార్పులను సానుభూతితో విశ్లేషించి అర్థం చేసుకోగలిగితే సామాజిక జీవితం సామరస్యంతో సాగిపోతుంది. అభ్యుదయాన్ని సాధించగలుగుతుంది.

నదీ సదృశమైన మన సమాజాన్ని శాస్త్రీయ దృష్టితో ప్రాచీనకాలం నుండీ దర్శించి హాస్యంతో మేళవించి ప్రొ. హరిమోహన్‌ ఝా ఈ రచన చేశారు. పాఠకులకు ఇది ఎంతో వినోదాన్ని, కొంతైనా విజ్ఞానాన్ని పంచుతుందని, ఆత్మావలోకనకు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను.

- జె. లక్ష్మిరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Purana Pralapam