• Puneetulu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పునీతులు

    Puneetulu

    Author:

    Publisher: Cisne Publications

    Pages: 231
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వీరూ దినచర్యలో ఏ మార్పూ లేదు. ఆఫీసులో ప్రకాష్‌తో పరిచయం అయ్యింది. అతను వీరూ కన్నా పెద్ద పోస్ట్‌లో ఉన్నా గర్వం లేకుండ వీరూతో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఒక విధంగా అతని స్నేహంతో కొంత మార్పు వచ్చింది. తనను కూడా ఇష్టపడేవాళ్ళు ఉన్నారన్న భావన చాలా కొత్తగా ఉంది.
ప్రకాష్‌ తనను మీరూ అని సంబోధించం చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. నిజం చెప్పాలంటే నాగేంద్ర కన్నా ఎక్కువ చదువుకున్నాడు. అయినా అహంకారం లేకుండా అందరితో కలసిమెలిసి గడుపుతాడు.
ఒకసారి వీరూ ఉండబట్టలేక ప్రకాష్‌ను అడిగాడు - ''మీరు ఇంత చదువుకుని ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు?'' అని.
''ఉద్యోగం పెద్ద చిన్న అన్నది మనం అనుకోవడంలో ఉంటుంది. నేను అనుకున్న ఆశయం తీరేదాకా ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఈ ఉద్యోగం చేస్తున్నాను'' అన్నాడు.
''మీరందరూ అంతంత పుస్తకాలు ఎలా చదువుతారండి? నాకు పుస్తకాలు అంటే భయం వేస్తుంది'' అన్నాడు వీరూ.
''మీకు పుస్తకాలు అంటే భయమా! ఆశ్చర్యంగా ఉంది'' అన్నాడు.
''పుస్తకాలంటే కాదు, పరీక్షలంటే భయం. పరీక్ష హాల్లో కూర్చున్నాక చదివినది కూడ మర్చిపోతాను. అందుకే అతికష్టం మీద స్కూల్‌ఫైనల్‌ పాస్‌ కాగలిగాను. అందరిలో పనికిరానివాడుగా మిగిలిపోయాను'' అన్నాడు.
''మీరు చదువుని ఒక భయంకర రూపంతో చూడ్డం నేర్చుకున్నారు. మనం చదివే చదువు మనను భయపెట్ట కూడదు. అది మనకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి.

Preview download free pdf of this Telugu book is available at Puneetulu